తెలుగు రాష్ట్రాల్లో హైఅలర్ట్..!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా అరకు లోయలో మావోయిస్టులు ప్రభుత్వ విప్, అరకు ఎంఎల్‌ఎ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎంఎల్‌ఎ సివేరి సోమలను ఆదివారం కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులను పోలీసులు అప్రమత్తం చేశారు. సమాచారం ఇవ్వకుండా నకల్స్ ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లొద్దని సూచించారు. ప్రస్తుతం అరకులో 144 సెక్షన్ అమలులో ఉంది. భారీగా పోలీసు, అదనపు బలగాలను మోహరించారు. మరోవైపు నిన్నటి ఘటనకు నిరసనగా […]

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా అరకు లోయలో మావోయిస్టులు ప్రభుత్వ విప్, అరకు ఎంఎల్‌ఎ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎంఎల్‌ఎ సివేరి సోమలను ఆదివారం కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులను పోలీసులు అప్రమత్తం చేశారు. సమాచారం ఇవ్వకుండా నకల్స్ ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లొద్దని సూచించారు. ప్రస్తుతం అరకులో 144 సెక్షన్ అమలులో ఉంది. భారీగా పోలీసు, అదనపు బలగాలను మోహరించారు. మరోవైపు నిన్నటి ఘటనకు నిరసనగా ప్రజాసంఘాలు ఏజెన్సీ బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో అరకులో దుకాణాలు, వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

Comments

comments