టిఆర్‌ఎస్‌కే ముస్లిం ఓటు

ముస్లిం మైనారిటీలకు కెసిఆర్ పథకాలు అపూర్వమైన మేలు గురుకులాలు, షాదీముబారక్‌లకు ముగ్ధులైన జనం బడ్జెట్‌లో కేటాయింపులతో పాటు 206 మైనారిటీ గురుకుల పాఠశాలలు మైనారిటీ సెక్యులర్ ఫ్రంట్ అధ్యక్షుడు నయీముల్లా షరీఫ్ హైదరాబాద్: రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో మైనారిటీ ఓటర్లు కీలక నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నారు. గతంలో కాంగ్రెస్, టిడిపి పాలనను చవిచూసిన ముస్లిం మైనారిటీలు నాలుగేళ్ళ టిఆర్‌ఎస్ పాలన పట్ల ఆకర్షితులైనట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన పలు పథకాలు ముస్లిం మైనారిటీలను సంతృప్తిపర్చాయి. […]

ముస్లిం మైనారిటీలకు కెసిఆర్ పథకాలు అపూర్వమైన మేలు గురుకులాలు, షాదీముబారక్‌లకు ముగ్ధులైన జనం
బడ్జెట్‌లో కేటాయింపులతో పాటు 206 మైనారిటీ గురుకుల పాఠశాలలు
మైనారిటీ సెక్యులర్ ఫ్రంట్ అధ్యక్షుడు నయీముల్లా షరీఫ్

హైదరాబాద్: రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో మైనారిటీ ఓటర్లు కీలక నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నారు. గతంలో కాంగ్రెస్, టిడిపి పాలనను చవిచూసిన ముస్లిం మైనారిటీలు నాలుగేళ్ళ టిఆర్‌ఎస్ పాలన పట్ల ఆకర్షితులైనట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన పలు పథకాలు ముస్లిం మైనారిటీలను సంతృప్తిపర్చాయి. టిఆర్‌ఎస్ ప్రభుత్వం మైనారిటీల కోసం బడ్జెట్‌లో కేటాయింపులను పెంచడంతోపాటు 206 మైనారిటీ గురుకుల పాఠశాలల ను ప్రారంభించి గతంలో ఎన్నడూ లేనంతగా విద్యావకా శాలను మెరుగుపర్చిందని నగరంలోని ఒక ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం నాయకుడొకరు వ్యాఖ్యానించారు. గురుకులాలతో పేద ముస్లిం విద్యార్థులకు నాణ్యమైన విద్య ఆంగ్లమాధ్యమంలో ఉచితంగా పొందగలు తున్నామని, ఇప్పటివరకు అలాంటి అవకాశాలే రాలేదని తెలంగాణ మైనారిటీ సెక్యులర్ ఫ్రంట్ అధ్యక్షుడు నయీ ముల్లా షరీఫ్ వ్యాఖ్యానించారు. షాదీ ముబారక్, మైనారిటీ గురుకల విద్యాసంస్థల పథకం ద్వారా చాలా మంది పేద ముస్లింలు లబ్ధి పొందారని, ఇవి వారి జీవితాల్లోనే గుణాత్మకమైన మార్పును తీసుకొచ్చిందని వివరించారు.

ఈ పథకం మైనారిటీలను బాగా ఆకట్టు కుందని, పిల్లలు ఉచితంగా ఉన్నత విద్యను అందుకోగల గడానికి కారణం కెసిఆర్ తీసుకున్న నిర్ణయమేనని వ్యాఖ్యానించారు. గతంలో సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మైనారిటీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవడమే తప్ప వారి అభివృద్ధికి, సంక్షేమానికి ఎలాంటి కృషి చేయలేదని అభిప్రాయం మరికొంతమంది ముస్లిం మైనారిటీల్లోనూ వ్యక్తం అవుతోంది. అయితే మైనారిటీలకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదనే అభిప్రాయం కూడా ముస్లిం వర్గాల్లో వ్యక్తమవు తోంది. వక్ఫ్ ఆస్తుల రక్షణ, వక్ఫ్‌బోర్డుకు చట్టబద్ధ అధికా రాలు కల్పించడం, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు తదితరాలు ఇంకా అమలుకు నోచుకోలేదని, రానున్న ఎన్నికల మేనిఫెస్టోలో దీనిపై టిఆర్‌ఎస్ ఎలాంటి వైఖరి వెల్లడిస్తుందో, హామీ ఇస్తుందో గమనిస్తామని తెలిపారు. గత ప్రభుత్వాలతో పోల్చితే టిఆర్‌ఎస్ ప్రభుత్వం మైనా రిటీలకు చాలా మేలు చేస్తోందనే భరోసా మైనారిటీల్లో వ్యక్తం అవుతోంది. మైనారిటీ సంస్థలు, సంఘాలు మేని ఫెస్టోల కోసం ఎదురు చూస్తున్నాయి.

Comments

comments