ప్రతి ఓటరు ఫోన్ నెంబర్ తీసుకోండి!

ఎన్నికల అధికారులకు రాష్ట్ర సిఇఒ ఆదేశాలు, సమాచారం చేరవేతకు సులువవుతుందని సూచన, ఓటర్లు 2.61 కోట్లు… ఫోన్ నెంబర్ ఇచ్చింది 69.11 లక్షల మందే  హైదరాబాద్: రాష్ట్రంలో ఓటు హక్కు కలిగిన వారిలో ఫోన్ నెంబర్లు పొందుపర్చినవారు నాల్గింట ఒక వంతు మంది మాత్రమే అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం గుర్తించింది. ప్రతీ ఓటరు ఫోన్ నెంబర్‌ను సేకరించాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సిఇఒ రజత్ కుమార్ జిల్లా ఎన్నికల అధికారులను (డిఇఒ) ఆదేశించారు. […]

ఎన్నికల అధికారులకు రాష్ట్ర సిఇఒ ఆదేశాలు, సమాచారం చేరవేతకు సులువవుతుందని సూచన, ఓటర్లు 2.61 కోట్లు… ఫోన్ నెంబర్ ఇచ్చింది 69.11 లక్షల మందే 

హైదరాబాద్: రాష్ట్రంలో ఓటు హక్కు కలిగిన వారిలో ఫోన్ నెంబర్లు పొందుపర్చినవారు నాల్గింట ఒక వంతు మంది మాత్రమే అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం గుర్తించింది. ప్రతీ ఓటరు ఫోన్ నెంబర్‌ను సేకరించాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సిఇఒ రజత్ కుమార్ జిల్లా ఎన్నికల అధికారులను (డిఇఒ) ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ప్ర కటించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 2.61 కోట్ల మంది ఓటర్లు ఉంటే, ఈ పది రోజుల్లో కొత్తగా దాదాపు 18 లక్షల మంది ఓటుహక్కు నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరో రెండు రోజుల గడువు ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ముసాయిదా జాబితాలో ప్రకటించిన 2.61 కోట్ల మంది ఓటర్ల జాబితాలో కేవలం 69.11 లక్షల మంది ఓటర్ల ఫోన్ నెంబర్లు మాత్రమే ఉన్నాయని, కొత్తగా నమోదు చేసుకున్న 18 లక్షల మంది దరఖాస్తుదారుల్లో 60 శాతం పైన వారి ఫోన్ నెంబర్లు పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు.

అయితే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ప్రతీ ఓటరు ఫోన్ నెంబర్ ఇసి దగ్గర ఉండాలని ఇటీవల సిఇఒ రజత్ కుమార్‌కు సూచించింది. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, ముసాయిదా ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా వీలైనంత వరకు ఫోన్ నెంబర్లు సేకరించే ప్రయత్నం చేయాలని పేర్కొంది. ఈ ఫోన్ నెంబర్ద ద్వారా ఓటర్లకు అవగాహన కల్పించడంలో ఓటు హక్కు వినియోగంపై చైతన్యం తీసుకురావచ్చునని తెలిపింది. సంబంధిత ఓటర్ల ఫోన్ నెంబర్‌లకు పోలింగ్ తేదీ, పోలింగ్ స్టేషన్ వివరాలను ఎస్‌ఎంఎస్ ద్వారా పంపవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం వ్యాఖ్యానించింది. అందులో భాగంగానే సిఇఒ రజత్ కుమార్ ప్రతీ ఓటరు ఫోన్ నెంబర్ వెబ్‌సైట్‌లో నమోదు అయి ఉండాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం ఓటు నమోదు, సవరణ కేంద్రాలలో ఈ ప్రక్రియ కూడా జరుగుతున్నట్లు సిఇఒ కార్యాలయ అధికారులు తెలిపారు.

ఎన్నికల ఫిర్యాదులకు 1950 టోల్‌ఫ్రీ నెంబర్
ఎన్నికల ఫిర్యాదులకు వచ్చే నెల 15వ తేదీ నుంచి టోల్ ఫ్రీ నెంబర్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్రస్థాయిలో ఒకటి, ప్రతి జిల్లాలోనూ ఒక్కొ క్క కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. కేవలం ఫోన్ మాట్లాడటమే కాకుండా ఫిర్యాదుల స్వీకరణకు వాట్సా ప్ గ్రూప్‌లు, యాప్‌లు వినియోగించుకోనున్నారు. ఫి ర్యాదుల పర్యవేక్షణతో పాటు వచ్చిన వాటిపై తీసకున్న చర్యల సమాచారం కూడా ఫిర్యాదుదారుడికి అందేలా పలు రకాల విధానాలు అనుసరించడంతో పాటు సాంకేతికతను వినియోగించుకోనున్నారు.

Comments

comments

Related Stories: