అమీర్‌పేట్ టు ఎల్‌బినగర్ మెట్రో పరుగు నేడే

మధ్యాహ్నం గం.12.00లకు అమీర్‌పేట్‌లో గవర్నర్ నరసింహన్ పచ్చజెండా మన తెలంగాణ/సిటీ బ్యూరో : అమీర్‌పేటఎల్‌బినగర్ మార్గంలో మెట్రో రైలు సర్వీసును గవర్నర్ నరసింహన్ సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అమీర్‌పేట స్టేషన్‌లో ప్రారంభించనున్నారు. మంత్రి కెటిఆర్ కూడా  కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్గం పనులను త్వరితగతిన పూర్తిచేసేలా చొరవ తీసుకుంది. తొలి దశలో నాగోల్  మియాపూర్ మార్గంలో మెట్రో సర్వీసులు అందుబాటులోకి రాగా ఇప్పుడు ఎల్‌బి నగర్ అమీర్‌పేట […]

మధ్యాహ్నం గం.12.00లకు అమీర్‌పేట్‌లో గవర్నర్ నరసింహన్ పచ్చజెండా

మన తెలంగాణ/సిటీ బ్యూరో : అమీర్‌పేటఎల్‌బినగర్ మార్గంలో మెట్రో రైలు సర్వీసును గవర్నర్ నరసింహన్ సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అమీర్‌పేట స్టేషన్‌లో ప్రారంభించనున్నారు. మంత్రి కెటిఆర్ కూడా  కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్గం పనులను త్వరితగతిన పూర్తిచేసేలా చొరవ తీసుకుంది. తొలి దశలో నాగోల్  మియాపూర్ మార్గంలో మెట్రో సర్వీసులు అందుబాటులోకి రాగా ఇప్పుడు ఎల్‌బి నగర్ అమీర్‌పేట మార్గం అందుబాటులోకి వస్తోంది. ప్రారంభోత్సవం అయిన వెంటనే ఈ మార్గంలో మెట్రోరైలు సేవలు ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ప్రయాణీకులు కేవలం 45 నిమిషాల్లోనే మియాపూర్ నుంచి ఎల్‌బినగర్‌కు చేరుకోవచ్చు. ప్రస్తుతం నాగోల్-మియాపూర్ మెట్రో రైలు సర్వీసు అమీర్‌పేట్ జంక్షన్ మీదుగా నడుస్తుండగా ఇప్పుడు ఎల్‌బినగర్ మెట్రో రైలు కూడా అమీర్‌పేటలోనే కలుస్తుంది.  16 స్టేషన్‌లకు ప్రయాణీకులు సులభంగా చేరుకునే వీలు కలుగుతుంది.

Related Stories: