గ్రీన్‌కార్డుకు రెడ్ సిగ్నల్

వాషింగ్టన్ :  విదేశీయులకు శాశ్వత నివాసయోగ్యత కల్పించే గ్రీన్‌కార్డులకు ట్రంప్ అధికార యంత్రాంగం మరింత కోత పెట్టనుంది. దేశానికి వలస వచ్చి వివిధ రకాలుగా ప్రభుత్వ ప్రయోజనాలను పొందుతున్న లేదా పొందేందుకు వీలున్న వారికి గ్రీన్‌కార్డులు ఇవ్వరాదని ఆలోచిస్తున్నారు. దీనిపై ఒక నిర్ణయానికి వస్తే అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఆహారం, నగదు సాయం  త దితర విషయాలలో ప్రభుత్వ పరంగా రాయితీలు పొందే విదేశీయులకు గ్రీన్‌కార్డులు ఇవ్వరాదని, గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు సంబంధించి […]

వాషింగ్టన్ :  విదేశీయులకు శాశ్వత నివాసయోగ్యత కల్పించే గ్రీన్‌కార్డులకు ట్రంప్ అధికార యంత్రాంగం మరింత కోత పెట్టనుంది. దేశానికి వలస వచ్చి వివిధ రకాలుగా ప్రభుత్వ ప్రయోజనాలను పొందుతున్న లేదా పొందేందుకు వీలున్న వారికి గ్రీన్‌కార్డులు ఇవ్వరాదని ఆలోచిస్తున్నారు. దీనిపై ఒక నిర్ణయానికి వస్తే అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఆహారం, నగదు సాయం  త దితర విషయాలలో ప్రభుత్వ పరంగా రాయితీలు పొందే విదేశీయులకు గ్రీన్‌కార్డులు ఇవ్వరాదని, గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు సంబంధించి వారు పొందుతున్న ప్రభుత్వ ప్రయోజనాల గురించి పూర్తి స్థాయిలో ఆరాతీయాలని ఈ నెల 21వ తేదీన అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రెటరీ ఒక ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదన గురించి సం బంధిత వెబ్‌సైట్‌లో పెట్టారు. ఈ ప్రతిపాదనపై సిలికాన్ ప్రాంత ఐటి పరిశ్రమ వర్గాలు, రాజకీయ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్ర హం వ్యక్తం చేశారు.

విదేశీ వలసదారులు తమ వీసా సర్దుబాట్లకు సంబంధించి దరఖా స్తు చేసుకున్నా, గ్రీన్‌కార్డు కోసం తాజాగా అభ్యర్థన చేసుకున్నా విధిగా తాము ఏ దశలోనూ ప్రభుత్వ ప్రయోజనాలను పొందలేదనే విషయాన్ని తెలియచేసుకోవల్సి ఉం టుంది. చట్టసభల తరఫున అనుమతి దక్కితే తప్ప వీటిని అనుభవించడానికి వీల్లేదని అధికార యంత్రాంగం ప్రతిపాదించింది. హెచ్ 4 వీసాదార్లకు వర్క్‌పర్మిట్లను రద్దు చేసే నిర్ణయాన్ని అమలు చేయడం జరుగుతుందని ట్రంప్ అధికార యంత్రాంగం స్పష్టం చేసిన దశలోనే ఇప్పుడు గ్రీన్‌కార్డులను లక్షంగా చేసుకుని చర్యలను ప్రతిపాదించింది. దేశంలో ఉండే విదేశీయులు తాము ప్రభుత్వ సాయం లేదా రాయితీలు పొందడం లేదు, ఇంతకు ముందు పొందలేదు, ఇక ముందు ఏ దశలోనూ పొందబోం అని నిర్థిష్టంగా తెలియచేయాల్సి ఉంటుందని ట్రంప్ అధికార యంత్రాంగం తాజాగా నిబంధనలకు దిగనుండటం అమెరికాలో స్థిరపడ్డ పలువురు భారతీయ ఉద్యోగుల గుండెల్లో విమానమోతలకు దారితీసింది.

Related Stories: