హైదరాబాద్‌కు మరో ఓటమి

న్యూఢిల్లీ: విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌లో హైదరాబాద్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. ఆదివారం ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 45 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బవనకా సందీప్ అద్భుత బ్యాటింగ్‌తో హైదరాబాద్‌ను ఆదుకున్నాడు. సౌరాష్ట్ర బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సందీప్ 3ఫోర్లు, మరో మూడు సిక్సర్లతో 83 బంతుల్లో 76 పరుగులు చేశాడు. 22 పరుగులకే […]

న్యూఢిల్లీ: విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌లో హైదరాబాద్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. ఆదివారం ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 45 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బవనకా సందీప్ అద్భుత బ్యాటింగ్‌తో హైదరాబాద్‌ను ఆదుకున్నాడు. సౌరాష్ట్ర బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సందీప్ 3ఫోర్లు, మరో మూడు సిక్సర్లతో 83 బంతుల్లో 76 పరుగులు చేశాడు. 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్‌ను సందీప్, వికెట్ కీపర్ సుమంత్ ఆదుకున్నారు. ఇద్దరు సౌరాష్ట్ర బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన సుమంత్ 4 ఫోర్లతో 47 పరుగులు చేశాడు. మిగతావారు విఫలం కావడంతో హైదరాబాద్ స్కోరు 196కే పరిమితమైంది. సౌరాష్ట్ర బౌలర్లలో కెప్టెన్ ఉనద్కట్ నాలుగు వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో విజెడి పద్ధతిలో సౌరాష్ట్రను విజేతగా ప్రకటించారు. అప్పటికే అర్పిత్ వస్వదా (23), ప్రేరక్ మన్కడ్ (27) పరుగులతో క్రీజులో ఉన్నారు. మరోవైపు ఓపెనర్ రాబిన్ ఉతప్ప ఆరు ఫోర్లు, ఒక సిక్స్‌తో వేగంగా 35 పరుగులు చేశాడు.

ముంబయి జయభేరి
బెంగళారులో జరిగిన మరో మ్యాచ్‌లో ముంబయి 173 పరుగుల తేడాతో రైల్వేస్‌ను చిత్తుగా ఓడించింది. పృథ్వీ షా (129), శ్రేయస్ అయ్యర్ (144) శతకాలతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబయి ఐదు వికెట్ల నష్టానికి 400 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రైల్వేస్ 42.4 ఓవర్లలో కేవలం 227 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారీ లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన రైల్వేస్ ప్రారంభం నుంచే తీవ్ర ఒత్తిడికి గురైంది. ముంబయి బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడమే కాకుండా వరుస క్రమంలో వికెట్లను తీస్తూ ప్రత్యర్థి జట్టును కోలుకోనివ్వలేదు. ఓపెనర్ కరన్ శర్మ 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ దశలో కెప్టెన్ సౌరభ్ వకస్కార్ 39 బంతుల్లోనే 7ఫోర్లు, ఒక సిక్స్‌తో వేగంగా 48 పరుగులు చేశాడు.

వన్‌డౌన్‌లో వచ్చిన దేవ్‌ధర్ ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 36 పరుగులు సాధించాడు. అవినాష్ యాదవ్ రెండు ఫోర్లతో 24 పరుగుల చేశాడు. ధాటిగా ఆడిన ప్రశాంత్ 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో వేగంగా 41 పరుగులు నమోదు చేశాడు. చివర్లో అంకిత్ యాదవ్ అజేయంగా 35 పరుగులు చేసినా జట్టును గెలిపించలేక పోయాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయిని ఓపెనర్ పృథ్వీషా, స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఆదుకున్నారు. ఇద్దరు రైల్వేస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన పృథ్వీషా 81 బంతుల్లోనే 14 ఫోర్లు, మరో ఆరు సిక్సర్లతో 129 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 118 బంతుల్లోనే పది సిక్సర్లు, మరో 8 బౌండరీలతో 144 పరుగులు సాధించాడు. సూర్యకుమార్ యాదవ్ ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. సిద్ధార్థ్ లడ్ అజేయంగా 30 పరుగులు సాధించాడు. దీంతో ముంబయి 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 400 పరుగుల రికార్డు స్కోరును నమోదు చేసింది.

Comments

comments

Related Stories: