గ్రామీణ బ్యాంకుల విలీనం

బ్యాంకుల సంఖ్యను 36కు కుదించనున్న ప్రభుత్వం న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏకీకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించనుంది. దీని ద్వారా ప్రస్తుతం ఉన్న 56 బ్యాంకుల సంఖ్యను 36 తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో రీజినల్ రూరల్ బ్యాంకుల(ఆర్‌ఆర్‌బి)కు చెందిన ఒకరితో కేంద్రం చర్చలు ప్రారంభించిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. స్పాన్సర్ బ్యాంక్‌లు రాష్ట్రాల్లో ఆర్‌ఆర్‌బిఐల విలీనం కోసం రోడ్ మ్యాప్‌ను కూడా సిద్ధం చేసినట్టు […]

బ్యాంకుల సంఖ్యను 36కు కుదించనున్న ప్రభుత్వం

న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏకీకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించనుంది. దీని ద్వారా ప్రస్తుతం ఉన్న 56 బ్యాంకుల సంఖ్యను 36 తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో రీజినల్ రూరల్ బ్యాంకుల(ఆర్‌ఆర్‌బి)కు చెందిన ఒకరితో కేంద్రం చర్చలు ప్రారంభించిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. స్పాన్సర్ బ్యాంక్‌లు రాష్ట్రాల్లో ఆర్‌ఆర్‌బిఐల విలీనం కోసం రోడ్ మ్యాప్‌ను కూడా సిద్ధం చేసినట్టు తెలిపారు. కాగా ఎస్‌బిఐ అనుబంధ బ్యాంకుల విలీనం తర్వాత మరో మూడు ప్రభుత్వరంగ బ్యాంకులు విలీనానికి ప్రభుత్వం సిద్ధమైంది. మూడు ప్రభుత్వరంగ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయా బ్యాంకులను విలీనం చేయనున్నట్టు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దేశంలో మూడో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అవతరించనుంది.

బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు అవసరమని, బ్యాం కుల మూలధనం సంరక్షణకు ప్రభుత్వం తగిన చర్య లు చేపడుతోందని ప్రభుత్వం పేర్కొంది.బ్యాంకింగ్ రం గంలో విదేశీ సేవల హేతుబద్ధీకరణ ఊపందుకుంది. బ్యాంకింగ్ రంగానికి గుదిబండలా మారిన మొండి బకాయిలు, చరిత్రలో జరిగిన పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.రుణాల మంజూరులో కఠిన నిబంధనలు,ఒత్తిడి ఆస్తుల పరిష్కారం,ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తు లు) విషయంలో పారదర్శకంగా వ్యవహరించడం, ఎన్‌పిఎపై నష్టాలకు కేటాయింపులపై నిర్ణయాలతో పాటు క్లీన్ బ్యాంకింగ్ దిశగా ప్ర భుత్వం సంస్కరణలు చేపట్టింది. ఇంకా సంస్కరణకు ఎజెండా, ఎటి1 బాండ్ల రీకాలింగ్, విదేశీ బ్యాం క్ శాఖల హేతుబద్ధీకరణ,రూ.50 కోట్లకు పైగా రుణాలకు సంబంధించిన వివరాల సేకరణ చేపట్టనున్నట్టు కేంద్ర తెలిపింది.

Related Stories: