చేలరేగిన ధావన్, రోహిత్…

దుబాయి: ఆసియాకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరుతున్న సూపర్4 మ్యాచ్‌లో భారత్ విజయానికి చేరువైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు అద్భుత శుభారంభాన్ని అందించారు. ఇద్దరు పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ పరుగుల వర్షం కురిపించారు. భీకర ఫాంలో ఉన్న రోహిత్, ధావన్‌లు ఈ సారి కూడా అదే జోరును కొనసాగించారు. […]

దుబాయి: ఆసియాకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరుతున్న సూపర్4 మ్యాచ్‌లో భారత్ విజయానికి చేరువైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు అద్భుత శుభారంభాన్ని అందించారు. ఇద్దరు పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ పరుగుల వర్షం కురిపించారు. భీకర ఫాంలో ఉన్న రోహిత్, ధావన్‌లు ఈ సారి కూడా అదే జోరును కొనసాగించారు. ప్రారంభం నుంచే పాక్ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. ఇద్దరు పోటీ పడి ఆడడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. తాజా సమాచారం లభించే సమయానికి భారత్ 30 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 179 పరుగులు చేసింది. చెలరేగి ఆడిన ధావన్ 90 బంతుల్లోనే 13 ఫోర్లు, ఒక సిక్స్‌తో 94 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శఱ్మ ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 84 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. విజయం కోసం భారత్ మరో 59 పరుగులు చేయాలి. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు ప్రారంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ ఇమాముల్ హక్ (10) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ ఫకర్ జమాన్ కాస్త పోరాటం కొనసాగించాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన జమాన్ ఒక ఫోర్, ఒక సిక్స్‌తో 31 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ వెంటనే బాబర్ ఆజమ్ కూడా వెనుదిరిగాడు. 9 పరుగులు చేసిన బాబర్ రనౌటయ్యాడు. దీంతో పాకిస్థాన్ 58 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.

ఆదుకున్న సర్ఫరాజ్, మాలిక్..
ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, వెటరన్ ఆటగాడు షోయబ్ మాలిక్ తమపై వేసుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా సమన్వయంతో ఆడారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇద్దరు స్ట్రయిక్‌ను రొటెట్ చేస్తూ భారత బౌలర్లకు కుదురుకునే ఛాన్స్ ఇవ్వలేదు. ఆత్మరక్షణతో బ్యాటింగ్ చేస్తూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. షోయబ్ కాస్త దూకుడును ప్రదర్శించగా సర్ఫరాజ్ మాత్రం డిఫెన్స్‌కే ప్రాధాన్యత ఇచ్చాడు. దీంతో పాక్ స్కోరు నక్కను తలపించింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన సర్ఫరాజ్ 68 బంతుల్లో రెండు ఫోర్లతో 44 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 107 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన షోయబ్ మాలిక్ 90 బంతుల్లో 4 ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. ఇదిలావుండగా ఆసిఫ్ అలీ కొద్ది సేపు మెరుపులు మెరిపించాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన ఒక ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి స్కోరును పెంచేందుకు ప్రయత్నించాడు. అయితే 30 పరుగులు చేసిన ఆసిఫ్‌కు చాహల్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. షాదాద్ ఖాన్ (10), మహ్మద్ నవాజ్ 15 (నాటౌట్) కాస్త రాణించడంతో పాకిస్థాన్ స్కోరు ఏడు వికెట్ల నష్టానికి 237 పరుగులకు చేరింది.

Comments

comments