నష్టపోయిన టాప్-7 కంపెనీలు

మొత్తంగా రూ.89,779 కోట్ల మార్కెట్ విలువ ఆవిరి న్యూఢిల్లీ: గతవారం మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.దీంతోపాటు టాప్ 10 బ్లూచిప్ కంపెనీల్లో ఏడు సంస్థలు దాదాపు రూ. 89,779.67 కోట్ల మార్కెట్ విలువ (ఎంక్యాప్)ను కోల్పోయాయి. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్) అత్యంతగా నష్టపోయాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఒఎన్‌జిసి మినహా మిగత కంపెనీలన్నీ నష్టాలను చవిచూశాయి. రిలయన్స్ మార్కెట్ క్యాపిటల్ రూ.22,530 కోట్లు నష్టపోయి రూ.7,71,293 కోట్లకు చేరింది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం […]

మొత్తంగా రూ.89,779 కోట్ల మార్కెట్ విలువ ఆవిరి

న్యూఢిల్లీ: గతవారం మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.దీంతోపాటు టాప్ 10 బ్లూచిప్ కంపెనీల్లో ఏడు సంస్థలు దాదాపు రూ. 89,779.67 కోట్ల మార్కెట్ విలువ (ఎంక్యాప్)ను కోల్పోయాయి. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్) అత్యంతగా నష్టపోయాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఒఎన్‌జిసి మినహా మిగత కంపెనీలన్నీ నష్టాలను చవిచూశాయి. రిలయన్స్ మార్కెట్ క్యాపిటల్ రూ.22,530 కోట్లు నష్టపోయి రూ.7,71,293 కోట్లకు చేరింది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ ఎంక్యాప్ రూ.18,161 కోట్లు నష్టపోయి రూ.2,41,008 కోట్లకు చేరగా, మారుతీ సుజుకీ రూ.17,922 కోట్లు మార్కెట్ విలువను కోల్పోయి రూ.2,42,858 కోట్లకు చేరింది. ఇక హెచ్‌డిఎఫ్‌సి మార్కెట్ విలువ రూ.13,524 కోట్లు తగ్గి రూ.3,10,784 కోట్లు అయింది.

ఇన్ఫోసిస్ ఎంక్యాప్ రూ.12,624 కోట్లు నష్టపోయి రూ.3,08,538 కోట్లకు చేరింది. ఇక ఎఫ్‌ఎంసిజి దిగ్గజం ఐటిసి విలువ రూ.3,178 కోట్లు డౌన్ అయి రూ.3,71,527 కోట్లకు చేరింది. హిందుస్తాన్ యునిలివర్ మార్కెట్ విలువ రూ.1,837 కోట్లు నష్టపోయి రూ.3,51,029 కోట్లకు చేరింది. మరోవైపు వీటికి విరుద్ధంగా టిసిఎస్ విలువ రూ.15,506 కోట్లు జంప్ చేసి రూ.8,05,455 కోట్లు కాగా, ప్రభుత్వరంగ చమురు దిగ్గజం ఒఎన్‌జిసి ఎంక్యాప్ రూ.9,240 కోట్లు పెరిగి రూ.2,31,126 కోట్లకు చేరింది. ఇక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్ విలువ కూడా రూ.6,095 కోట్లు పెరిగి రూ.5,34,530 కోట్లకు చేరింది. ర్యాంకింగ్ పరంగా చూస్తే మొదటి స్థానంలో టిసిఎస్ నిలిచింది. ఆ తర్వాత వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐటిసి, హెచ్‌యుఎల్, హెచ్‌డిఎఫ్‌సి, ఇన్ఫోసిస్, మారుతీ, ఎస్‌బిఐ, ఒఎన్‌జిసి ఉన్నాయి.