క్రిస్టల్ ప్రొడక్షన్ లిమిటెడ్ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం

వనస్థలిపురం: వనస్థలిపురం ఆటోనగర్ పారిశ్రామికవాడలో ఆదివారం తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్కూట్ కారణంగా క్రిస్టల్ ప్రొడక్షన్ లిమిటెడ్ గోడౌన్ దగ్ధమైంది. ఇందులోని పదికోట్ల విలువ చేసే పెస్టిసైడ్స్ (పురుగుల మందులు), సీడ్స్ అగ్నికి ఆహుతైయ్యాయి. తెలంగాణాలోని 31 జిల్లాలకు పెస్టిసైడ్స్, సీడ్స్ సప్లయ్ కోసం వనస్థలిపురం ఆటోనగర్‌లోని క్రిస్టల్ క్రాప్ ప్రొడక్షన్ లిమిటెడ్ పేరుతో గోడౌన్‌ను ఏర్పాటు చేశారు. హర్యాణాలో ఉత్పత్తి చేసిన పెస్టిసైడ్స్, సీడ్స్‌ని ఇక్కడ నిల్వ ఉంచి […]


వనస్థలిపురం: వనస్థలిపురం ఆటోనగర్ పారిశ్రామికవాడలో ఆదివారం తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్కూట్ కారణంగా క్రిస్టల్ ప్రొడక్షన్ లిమిటెడ్ గోడౌన్ దగ్ధమైంది. ఇందులోని పదికోట్ల విలువ చేసే పెస్టిసైడ్స్ (పురుగుల మందులు), సీడ్స్ అగ్నికి ఆహుతైయ్యాయి. తెలంగాణాలోని 31 జిల్లాలకు పెస్టిసైడ్స్, సీడ్స్ సప్లయ్ కోసం వనస్థలిపురం ఆటోనగర్‌లోని క్రిస్టల్ క్రాప్ ప్రొడక్షన్ లిమిటెడ్ పేరుతో గోడౌన్‌ను ఏర్పాటు చేశారు. హర్యాణాలో ఉత్పత్తి చేసిన పెస్టిసైడ్స్, సీడ్స్‌ని ఇక్కడ నిల్వ ఉంచి డీలర్లకు సప్లయ్ చేస్తుంటారు. ఆదివారం తెల్లవారు జామున గోడౌన్ నుంచి దట్టమైన పొగతో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో వనస్థలిపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది ఐదు గంటలపాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకవచ్చారు. సుమారు పది కోట్ల విలువచేసే పురుగుల మందులు, సీడ్స్ మంటల్లో కాలిపోయినట్లు గోడౌన్ ఇంచార్జీ నరేంద్రనాథ్ బాచు తెలిపారు. ఇంచార్జీ ఫిర్యాదుతో వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి విద్యుత్ షాట్ సర్కూట్ కారణమా…లేక మరేఇతర కారణాలున్నాయా… అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఆటోనగర్‌లోని స్థానికుల మాత్రం ఇన్సూరెన్స్ కోసమే యాజమాన్యం గోడౌన్ తగలబెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments

Related Stories: