ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభించిన ప్రధాని మోఢీ

జార్ఖండ్:  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం , ప్రధానమంత్రి జన్ ఆరోగ్య అభియాస్ యోజన ను ప్రధాని నరేంద్ర మోఢీ ఇవాళ జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో ప్రారంభించారు. ఈ పథకం సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సేవల పథకంగా పేరున్న ఆయుష్మాన్ భారత్- జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం లబ్దిదారులైన కుటుంబానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తుంది. గ్రామీణ పేదరిక ,అణగారిన వర్గాలు, […]

జార్ఖండ్:  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం , ప్రధానమంత్రి జన్ ఆరోగ్య అభియాస్ యోజన ను ప్రధాని నరేంద్ర మోఢీ ఇవాళ జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో ప్రారంభించారు. ఈ పథకం సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సేవల పథకంగా పేరున్న ఆయుష్మాన్ భారత్- జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం లబ్దిదారులైన కుటుంబానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తుంది. గ్రామీణ పేదరిక ,అణగారిన వర్గాలు, గుర్తింపు పొందిన 11 11 వృత్తుల పట్టణ కార్మికులతో కలిపి మొత్తం 10 కోట్ల కుటుంబాలకు చెందిన 50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుంది. ఈ పథకంలో చేరిన వారికి ప్రభుత్వ, లిస్టెడ్ ప్రైవేట్ దవాఖానల్లో సేవలు లభిస్తాయి.

ఓటరు కార్డు, రేషన్ కార్డుతో దరఖాస్తు..

అర్హులు ఓటరు గుర్తింపు కార్డుతో గానీ, రేషన్‌కార్డుతో గానీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కోసం ఆధార్ నంబర్ నమోదు తప్పనిసరి కాదు. పథకం గురించి తెలుసుకునేందుకు మేరా.పిఎంజెఎవై.గవ్.ఇన్ అనే పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ఒక హెల్ప్ లైన్ నంబర్ (14555)ను సంప్రదించవచ్చు. ఈ పథకం అమలు కోసం కేంద్రం తో 31 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎంవొయులపై సంతకాలు చేశాయి.

Comments

comments

Related Stories: