ఎంఎల్ఎ వాహనాన్ని ఆపి కాల్చారు: డిఐజి

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా అరకు ఎంఎల్ఎ సర్వేశ్వర రావు, మాజీ ఎంఎల్ఎ శివేరి సోమలను మావోలు కాల్చి చంపిన విషయం తెలిసిందే.  గ్రామదర్శినికి వెళ్తుండగా ఎంఎల్‌ఎ సర్వేశ్వరరావు, మాజీ ఎంఎల్‌ఎ శివేరి సోమల వాహనాలను మావోయిస్టులు ఆపారని విశాఖ రేంజ్ డిఐజి శ్రీకాంత్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు సుమారు 20 మంది మావోయిస్టులు వారిని అడ్డుకొని కాల్చి చంపారని వెల్లడించారు.  ఎంఎల్‌ఎ, మాజీ ఎంఎల్‌ల పిఎస్‌ఒల వద్ద ఉన్న ఆయుధాలను లాక్కున్నారని వివరించారు. […]

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా అరకు ఎంఎల్ఎ సర్వేశ్వర రావు, మాజీ ఎంఎల్ఎ శివేరి సోమలను మావోలు కాల్చి చంపిన విషయం తెలిసిందే.  గ్రామదర్శినికి వెళ్తుండగా ఎంఎల్‌ఎ సర్వేశ్వరరావు, మాజీ ఎంఎల్‌ఎ శివేరి సోమల వాహనాలను మావోయిస్టులు ఆపారని విశాఖ రేంజ్ డిఐజి శ్రీకాంత్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు సుమారు 20 మంది మావోయిస్టులు వారిని అడ్డుకొని కాల్చి చంపారని వెల్లడించారు.  ఎంఎల్‌ఎ, మాజీ ఎంఎల్‌ల పిఎస్‌ఒల వద్ద ఉన్న ఆయుధాలను లాక్కున్నారని వివరించారు. సర్వేశ్వరరావు, సోమ భౌతికకాయాలను కెజిహెచ్‌కు తరలిస్తున్నామని డిఐజి పేర్కొన్నారు. ఒడిశా సరిహద్దుకు 15 కిలో మీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించారు. ఘటన సమయంలో పది మంది మావోలు ఆయుధాలతో కనిపించారని, ఘటనకు గల కారణాలను పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామన్నారు.

ఈ ఘటన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలైన ఎపి, తెలంగాణలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల ప్రజాప్రతినిధులు ఎటువంటి రక్షణ లేకుండా మారుమూల అటవీ ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు. అనివార్య పరిస్థితుల్లో మారుమూల ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు సమీప పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలని పోలీసు అధికారులు కోరారు.

Comments

comments