అరకు ఎంఎల్‌ఎ కాల్చివేత

విశాఖపట్నం : అరకు ఎంఎల్‌ఎ, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావును ఆదివారం మావోయిస్టులు కాల్చి చంపారు. ఆయనతో పాటు ఉన్న మాజీ ఎంఎల్‌ఎ శివేరి సోమను కూడా మావోయిస్టులు కాల్చి చంపారు. మావోయిస్టుల దాడిలో కిడారి అనుచరులు కొందరు గాయపడినట్టు తెలుస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి నుంచి కిడారి విజయం సాధించారు. అనంతరం ఆయన అధికార టిడిపిలో చేరారు. కిడారికి భార్య , ఇద్దరు కొడుకులు ఉన్నారు. కిడారిని మావోయిస్టులు హత్య చేసినట్టు జిల్లా ఎస్‌పి […]

విశాఖపట్నం : అరకు ఎంఎల్‌ఎ, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావును ఆదివారం మావోయిస్టులు కాల్చి చంపారు. ఆయనతో పాటు ఉన్న మాజీ ఎంఎల్‌ఎ శివేరి సోమను కూడా మావోయిస్టులు కాల్చి చంపారు. మావోయిస్టుల దాడిలో కిడారి అనుచరులు కొందరు గాయపడినట్టు తెలుస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి నుంచి కిడారి విజయం సాధించారు. అనంతరం ఆయన అధికార టిడిపిలో చేరారు. కిడారికి భార్య , ఇద్దరు కొడుకులు ఉన్నారు. కిడారిని మావోయిస్టులు హత్య చేసినట్టు జిల్లా ఎస్‌పి రాహుల్‌దేవ్ నిర్ధారించారు. మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్న కిడారికి పలుమార్లు బెదిరింపులు కూడా వచ్చాయి. కిడారిని 50 మంది మహిళా  మావోయిస్టులు కాల్చి చంపినట్టు తెలుస్తోంది. డంబ్రీగూడ మండలం లిప్పిట్టిపుట్టు వద్ద మావోయిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. కిడారిని హత్య చేసిన తరువాత మావోయిస్టులు ఏ ప్రాంతానికి వెళ్లారన్న దానిపై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టుల ఘాతుకంపై అరకు ప్రాంత ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Araku MLA Kidari Sarveswara Rao Shot Dead By Maoists

Comments

comments

Related Stories: