కాంగ్రెస్‌పై నిర్మలా సీతారామన్ మండిపాటు

ఢిల్లీ : రాఫెల్ ఒప్పందంపై దేశంలో రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. రాఫెల్ ఒప్పందంపై అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం పతాకస్థాయికి చేరుకుంది. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం మోడీని దొంగ అంటూ చేసిన ట్వీట్‌పై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే స్పందించారు. తాజాగా రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రస్థాయిలో స్పందించారు. రాహుల్ గాంధీ కూడా దొంగల కుటుంబం నుంచి వచ్చిన వారేనంటూ ఆమె […]

ఢిల్లీ : రాఫెల్ ఒప్పందంపై దేశంలో రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. రాఫెల్ ఒప్పందంపై అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం పతాకస్థాయికి చేరుకుంది. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం మోడీని దొంగ అంటూ చేసిన ట్వీట్‌పై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే స్పందించారు. తాజాగా రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రస్థాయిలో స్పందించారు. రాహుల్ గాంధీ కూడా దొంగల కుటుంబం నుంచి వచ్చిన వారేనంటూ ఆమె ధ్వజమెత్తారు. రాఫెల్ ఒప్పందంలో ఎటువంటి అక్రమాలు జరగలేదని ఆమె తేల్చి చెప్పారు. కావాలనే రాహుల్‌గాంధీ ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాఫెల్ ఒప్పందంలో ఎటువంటి దాపరికం లేదన్నారు. కావాలనే కాంగ్రెస్ ఈ అంశంపై రాద్ధాంతం చేస్తుందని ఘాటుగా విమర్శించారు. అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్‌కు పిచ్చి పట్టిందన్నారు. రాహుల్ ప్రధాని మోడీని దొంగ అనడంపై దేశ వ్యాప్తంగా ప్రజలు మండిపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో ఎటువంటి అవినీతి లేదని, గతంలో పాలకులుగా ఉన్న కాంగ్రెస్ నేతల హయాంలోనే ఎన్నో కుంభకోణాలు జరిగాయని, అవినీతి జరిగిందని ఆమె ఆరోపించారు.

Nirmala Sitharaman Comments on Congress

Comments

comments

Related Stories: