కోలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ని చూశారా..?

ఇటీవల టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన మూవీ ‘అర్జున్ రెడ్డి’. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా తొలి షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. విజయ్ నటనకు యువత ఫిదా అయిపోయారు. ఈ మూవీతో విజయ్ రాత్రికిరాత్రే స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ఇలా తెలుగులో బంపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి ఇతర భాషల్లోనూ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. త‌మిళంలో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా ‘వర్మ’ పేరు తో […]

ఇటీవల టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన మూవీ ‘అర్జున్ రెడ్డి’. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా తొలి షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. విజయ్ నటనకు యువత ఫిదా అయిపోయారు. ఈ మూవీతో విజయ్ రాత్రికిరాత్రే స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ఇలా తెలుగులో బంపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి ఇతర భాషల్లోనూ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. త‌మిళంలో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా ‘వర్మ’ పేరు తో సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ధృవ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో క‌థానాయిక మేఘా చౌద‌రిని బైక్‌పై ఎక్కించుకొని ధృవ్ దూసుకెళుతున్నాడు. తమిళంలో ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు బాల తెరకెక్కిస్తున్నాడు. నేషనల్ అవార్డు విన్నర్ రాజు మురుగున్ చిత్రానికి డైలాగ్స్ రాయడం విశేషం. టాలీవుడ్ లో చిత్రం భారీ విజయం సాధించడంతో కోలీవుడ్ లో కూడా ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

Comments

comments

Related Stories: