హైదరాబాద్: బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట ఉత్కంఠభరితంగా సాగింది. బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది. ఆదివారం ఉదయం 10 గంటలకు బాలాపూర్ గ్రామంలో ఉత్సవ కమి టీ సభ్యులు వేలం పాటను ప్రారంభించారు. శ్రీనివాస్ గుప్తా అనే భక్తుడు రూ.16.60 లక్షలకు బాలాపూర్ గణపతి లడ్డూను దక్కించుకున్నాడు. గత సంవత్సరం కంటే ఈసారి లక్ష రూపాయలు ఎక్కువ ధర పలికింది. 2017 వసంవత్సరంలోరూ. 15.60 లక్షలకు నగరంలోని అయ్యప్ప సొసైటీకి చెందిన నాగం తిరుపతిరెడ్డి లడ్డూను కైవసం చేసుకున్నాడు. 2016 సంవత్సరం స్కైలాబ్‌రెడ్డి రూ. 14.65లక్షలకు దక్కించుకున్నాడు. 2015 వ సంవత్సరంలో రూ.10.32 లక్షలు కళ్లేం మదన్‌మోహన్‌రెడ్డి దక్కించుకున్నారు. ఈ వేలంపాటలో వేలాది భక్తులు పాల్గొన్నారు. 23ఏళ్ల క్రితం కేవలం రూ. 450 పలికిన లడ్డూ ఏటికేడు పెరుగుతూ వచ్చి ఇవాళ ఏకంగా రూ. రూ. 16.60 లక్షలు ధర పలకడం గమనార్హం.
Balapur Laddu Auction 2018
Telangana news
Comments
comments