అంతర్జాలంలో అసత్య ప్రచారం.. అమృత ఆవేదన…

నల్గొండ: పట్టపగలు అందరూ చూస్తుండగానే నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో దుండగులు పెరుమాళ్ళ ప్రణయ్(25) అనే యువకుడిని అత్యంత కిరాతకంగా నరికి చంపేసిన సంగతి తెలిసిందే. కూతురు అమృత వర్షిణి కులాంతర వివాహం చేసుకోవడం జిర్ణీంచుకోలేని తండ్రి మారుతి రావు కిరాయి రౌడీలతో పక్కా ప్లాన్ ప్రకారం ప్రణయ్ ను హత్య చేయించాడు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులు పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకి పంపారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో గత వారం రోజులుగా కథనలు వెల్లువల వస్తున్నాయి. అయితే, సామాజిక మాధ్యమాల్లో తనను అవమానించేలా […]

నల్గొండ: పట్టపగలు అందరూ చూస్తుండగానే నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో దుండగులు పెరుమాళ్ళ ప్రణయ్(25) అనే యువకుడిని అత్యంత కిరాతకంగా నరికి చంపేసిన సంగతి తెలిసిందే. కూతురు అమృత వర్షిణి కులాంతర వివాహం చేసుకోవడం జిర్ణీంచుకోలేని తండ్రి మారుతి రావు కిరాయి రౌడీలతో పక్కా ప్లాన్ ప్రకారం ప్రణయ్ ను హత్య చేయించాడు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులు పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకి పంపారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో గత వారం రోజులుగా కథనలు వెల్లువల వస్తున్నాయి. అయితే, సామాజిక మాధ్యమాల్లో తనను అవమానించేలా పోస్ట్‌లు పెడితే కేసులు పెడతానని ప్రణయ్‌ భార్య అమృత హెచ్చరించింది. ప్రణయ్‌ హత్య ఘటన అనంతరం రాజకీయ, ప్రజాసంఘాల నేతలు పెద్దఎత్తున వెళ్లి ఆమెను పరామర్శించారు. ప్రభుత్వం కూడా ఆమె కుటుంబానికి బాసటగా నిలిచేందుకు ముందుకొచ్చింది. అమృతకు ఆర్థిక సాయంతోపాటు, ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, భూమి ఇస్తామని ప్రకటించింది. కాగా, దీనిపై కొందరు సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రణయ్‌తో ప్రేమ నుంచి హత్య దాకా జరిగిన అన్ని పరిణామాల్లో అంతా ఆమెనే తప్పుబడుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి పోస్టులు పెట్టేవారిపై కోర్టులో కేసులు వేస్తానని అమృత చెప్పింది. ఇదిలాఉండగా అమృత సమస్యను రెండు కులాలకు చెందిన అంశంగా ముడిపెడుతూ సోషల్‌మీడియాలో చర్చ చేయడాన్ని కొందరు సామాజిక వాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపై సైబర్ క్రైమ్ అధికారులు దృష్టి సారించాలని చెబుతున్నారు.

Comments

comments

Related Stories: