పోలీస్ వాహనంపై రాళ్లు రువ్విన యువకులు!

జగిత్యాల: కొందరు యువకులు పోలీస్ వాహనంపై రాళ్ళతో దాడికి పాల్పడిన సంఘటన జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లిలో చోటుచేసుకుంది. స్థానిక ముదిరాజ్ సింహసేనకు చెందిన యువకులకు ఆదివారం ఉదయం వినాయక నిమజ్జనం సమయంలో పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో యువకులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. రెచ్చిపోయిన యువకులు పోలీస్ వాహనం అద్దాలు పగులగొట్టారు. ఈ ఘటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించి యువకులను చెదరగొట్టారు. ప్రస్తుతం మెట్‌పల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. Comments comments

జగిత్యాల: కొందరు యువకులు పోలీస్ వాహనంపై రాళ్ళతో దాడికి పాల్పడిన సంఘటన జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లిలో చోటుచేసుకుంది. స్థానిక ముదిరాజ్ సింహసేనకు చెందిన యువకులకు ఆదివారం ఉదయం వినాయక నిమజ్జనం సమయంలో పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో యువకులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. రెచ్చిపోయిన యువకులు పోలీస్ వాహనం అద్దాలు పగులగొట్టారు. ఈ ఘటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించి యువకులను చెదరగొట్టారు. ప్రస్తుతం మెట్‌పల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Comments

comments