గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యం!

హైదరాబాద్: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  గండిపేట మండలం మంచిరేవుల గ్రామ శివారు ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి(30) మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వారం రోజుల క్రితమే చనిపోయి ఉంటాడని తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో ఒంటిపై ఉన్న బట్టలు, కాలికి ఉన్న షూస్ ఆధారంగా పోలీసులు వివరాలను సేకరించే పనిలో ఉన్నారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు […]

హైదరాబాద్: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  గండిపేట మండలం మంచిరేవుల గ్రామ శివారు ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి(30) మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వారం రోజుల క్రితమే చనిపోయి ఉంటాడని తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో ఒంటిపై ఉన్న బట్టలు, కాలికి ఉన్న షూస్ ఆధారంగా పోలీసులు వివరాలను సేకరించే పనిలో ఉన్నారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments