మహా గణపతి శోభాయాత్ర ప్రారంభం

హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్రం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఆరో నెంబర్ క్రేన్ వద్ద మహా గణేష్ నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట కల్లా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి చేయాలని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఆదివారం గణపతి నిమజ్జనం దృష్ట్యా నగరవ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్, ఎన్ టిఆర్ మార్గ్ లలో సాధారణ వాహనాలను అనుమతించడం లేదు. జియో ట్యాగింగ్ ద్వారా విగ్రహాల మానిటరింగ్ జరుగుతుంది. ప్రజలు అసౌకర్యాలకు […]

హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్రం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఆరో నెంబర్ క్రేన్ వద్ద మహా గణేష్ నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట కల్లా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి చేయాలని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఆదివారం గణపతి నిమజ్జనం దృష్ట్యా నగరవ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్, ఎన్ టిఆర్ మార్గ్ లలో సాధారణ వాహనాలను అనుమతించడం లేదు. జియో ట్యాగింగ్ ద్వారా విగ్రహాల మానిటరింగ్ జరుగుతుంది. ప్రజలు అసౌకర్యాలకు గురికాకుండా నిమజ్జన రూట్లలో వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.

Related Stories: