హెచ్4 విసా వర్క్ పర్మిట్లకు ముప్పు

మూడు నెలల్లో రద్దు నిర్ణయం, అమెరికా అధికారుల వెల్లడి వాషింగ్టన్ : దేశంలోని హెచ్ 4 వీసాదారుల వర్క్ పర్మిట్ల రద్దు నిర్ణయం అధికారికంగా వచ్చే మూడు నెలల్లో వెలువడుతుందని అమెరికా అధికార యంత్రాం గం తెలిపింది. ఈ కీలక అంశంపై ఫెడరల్ కోర్టు ముందు శనివారం తమ వివరణ ఇచ్చుకుంది. అమెరికాలో హెచ్ 1బి విసాలపై తాత్కాలిక ఉద్యోగాలలో ఉన్న వారి జీవిత భాగస్వాములు హెచ్ 4 వీసాలపై ఇక్కడ ఉంటున్నారు. వీరికి వర్క్ పర్మిట్లను […]

మూడు నెలల్లో రద్దు నిర్ణయం, అమెరికా అధికారుల వెల్లడి

వాషింగ్టన్ : దేశంలోని హెచ్ 4 వీసాదారుల వర్క్ పర్మిట్ల రద్దు నిర్ణయం అధికారికంగా వచ్చే మూడు నెలల్లో వెలువడుతుందని అమెరికా అధికార యంత్రాం గం తెలిపింది. ఈ కీలక అంశంపై ఫెడరల్ కోర్టు ముందు శనివారం తమ వివరణ ఇచ్చుకుంది. అమెరికాలో హెచ్ 1బి విసాలపై
తాత్కాలిక ఉద్యోగాలలో ఉన్న వారి జీవిత భాగస్వాములు హెచ్ 4 వీసాలపై ఇక్కడ ఉంటున్నారు. వీరికి వర్క్ పర్మిట్లను రద్దు చేస్తామని ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత అధికార యంత్రాంగం చెపుతూ వస్తోంది. దీనితో వేలాది మంది భారతీయ దంపతులతో పాటు ఎందరో విదేశీయులు ఆందోళనకు గురి అవుతున్నారు. తాజాగా ఇప్పుడు ఫెడరల్ కోర్టు ముందు స్వదేశీ భద్రతా విభాగం (డిహెచ్‌ఎస్) తమ వాదనను విన్పించింది.
ఇందులో హెచ్ 4 వీసాదార్ల ఉద్యోగాలకు చెక్ పెట్టకతప్పదనే సంకేతాలు ఇచ్చింది. వర్క్ పర్మిట్లపై రద్దు నిర్ణయాన్ని సూత్రప్రాయంగా తీసుకున్నట్లు, వచ్చే మూడు నెలల్లో దీనిపై ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు కొలంబియా కోర్టుకు వివరణ ఇచ్చుకుంది. హెచ్ 1బి నాన్ ఇమ్మిగ్రెంట్స్ జీవితభాగస్వాములైన హెచ్ 4 వీసాదారులను ఉద్యోగ పరిధికి అనర్హత వర్గంగా పరిగణించేందుకు ప్రతిపాదించడం జరిగింది. ఈ దిశలో నిర్థిష్టరీతిలో కొందరిని ఈ పరిధిలోకి తెచ్చేందుకు పటిష్టమైన, సత్వర చర్యల దిశలో సాగుతున్నట్లు వీసాలు, ఉద్యోగ పర్మిట్లకు సంబంధించిన ఈ విభాగం తెలిపింది. తమ కొత్త నిర్ణయం పూర్వాపరాలను, ప్రతిపాదించిన నూతన నిబంధనను బడ్జెట్ మేనేజ్‌మెంట్ కార్యాలయానికి (ఒఎంబి) , వైట్‌హౌస్‌కు వచ్చే మూడు నెలల్లో సమర్పిస్తామని తెలియచేసుకుంది. ఈ మూడు నెలల కాలం తమ నిర్ణయాన్ని తాత్కాలికంగా అచేతనంగా పెట్టాలని న్యాయస్థానానికి విన్నవించుకున్నారు.
ఒబామా వెసులుబాటుపై రగిలిన వ్యాజ్యం
విదేశాల నుంచి వచ్చి ఇక్కడికి ఉద్యోగాలకు వచ్చే జీవితభాగస్వాములకు ఒబామా హయాంలో వర్క్ పర్మిట్ల వెసులుబాటు కల్పించారు. దీనితో అప్పటి నుంచి భారతీయ దంపతులు ఉద్యోగాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఈ విధానంతో స్వదేశానికి చెందిన తమ ఉద్యోగాలకు గండి పడుతుందని, దీనిని రద్దు చేయాలని కోరుతూ సేవ్ జాబ్స్ యుఎస్‌ఎ పేరిట కోర్టులో వ్యాజ్యం దాఖలు అయింది. పలు దఫాల విచారణల దశలలోనూ, బహిరంగంగానూ కూడా ట్రంప్ అధికార యంత్రాంగం హెచ్ 4 వీసాలకు వర్క్ పర్మిట్లను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి అధికారికంగా నిబంధనలతో చట్టపరమైన ఎన్‌పిఆర్‌ఎంను వెలువరిస్తామని చెపుతూ వస్తోంది. దీనికి సంబంధించి హోంలాండ్ డిపార్ట్‌మెంట్ వారు మూడు స్థాయీ నివేదికలను అందించారు. ఫిబ్రవరి 28న, మే 22, ఆగస్టు 20న వీటిని దాఖలు చేశారు. ఇక తమ తదుపరి స్థాయీ నివేదికను నవంబర్ 19వ తేదీన దాఖలు చేస్తామని ఈ విభాగం తెలిపింది. తమ విభాగానికి చెందిన ఉన్నత స్థాయి అధికారుల బృందం ప్రతిపాదిత నిబంధనలపై సమీక్షలు నిర్వహించడం, దీనిని అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్)కు పంపించడం, వారి సమీక్షను కోరడం జరిగిందని అందుకే నిర్ణయం అధికారికంగా వెల్లడించడంలో జాప్యం జరుగుతోందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఇది చాలా కీలక నిర్ణయం అని , దీనిని ఎక్కువ కాలం సుషుప్తావస్తలో పెట్టడం అనుచితం అని పిటిషనరైన సేవ్ జాబ్స్ యుఎస్‌ఎ వారు కోర్టుకు తెలిపారు. ఎక్కువ కాలం జాప్యం జరుగుతూ ఉన్న కొద్దీ ఇదే స్థాయిలో అమెరికా ఉద్యోగులకు హాని జరుగుతుందని వాపొయ్యారు. ఇదే సమయంలో వివాహం తరువాత జీవితభాగస్వాములతో అమెరికాకు వచ్చి హెచ్ 4 వీసాలపై ఉన్న వర్క్ పర్మిట్ సౌకర్యంతో ఉద్యోగాలు చేస్తున్న ఎందరో భారతీయులు ఈ పిడుగుపాటు నిర్ణయంతో తల్లడిల్లుతున్నారు.
భారతీయులకు 93 శాతం వర్క్ పర్మిట్లు
హెచ్ 4 వీసాలపై వర్క్ పర్మిట్లను 93 శాతం వరకూ భారతీయులకే జారీ చేశారు. ఇక చైనాలో జన్మించిన వారికి 5 శాతం వరకూ ఇక మిగిలిన రెండు శాతం ఇతర అన్ని దేశాల వారికీ కలిపి మంజూరు చేసినట్లు చట్టసభలకు సంబంధించిన పరిశోధనా సేవల విభాగం వారి అధ్యయనంలో వెల్లడైంది. యుఎస్‌సిఐఎస్ నుంచి అందిన సమాచారం మేరకు వారు వర్క్‌పర్మిట్లకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించారు.

Comments

comments

Related Stories: