ప్రతి గింజ కొనుగోలు

 రాష్ట్రంలో ప్రతి ధాన్యపు గింజ కొనుగోలే ప్రభుత్వ లక్షం  దళారుల మోసాలకు చెక్ పెట్టడడమే ధ్యేయం  57లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అవకాశం  34.37లక్షల టన్నుల సేకరణ  3140 కేంద్రాల ఏరాటు  జెసిలతో ఈటల సమీక్ష మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో రైతులు పండించే ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఖరీఫ్ లోవచ్చే పంటను మధ్యవర్తులు కొన కుండా, తక్కువ ధరకు రైతులు […]

 రాష్ట్రంలో ప్రతి ధాన్యపు గింజ కొనుగోలే ప్రభుత్వ లక్షం
 దళారుల మోసాలకు చెక్ పెట్టడడమే ధ్యేయం
 57లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అవకాశం
 34.37లక్షల టన్నుల సేకరణ
 3140 కేంద్రాల ఏరాటు
 జెసిలతో ఈటల సమీక్ష

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో రైతులు పండించే ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఖరీఫ్ లోవచ్చే పంటను మధ్యవర్తులు కొన కుండా, తక్కువ ధరకు రైతులు అ మ్ముకునే పరిస్థితి లేకుండా ప్రతి గిం జను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఖరీఫ్ ధాన్యం సేకరణపై శనివా రం అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో ఈటల సమీక్ష నిర్వహించారు. ఈ ఖరీఫ్‌లో 57 లక్షల మె ట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశముందని పౌరసరఫరాలశాఖ అధికారులు అం చనా వేసినట్లు తెలిపారు. స్థానిక అవసరాలు, విత్తనాల వినియోగంతోపాటు మిల్లర్లు కొనుగోలు ను మినహాయిస్తే 34.37లక్షల మెట్రిక్ టన్నులు మిగిలే అవకాశముందన్నారు.దీన్ని పూర్తిస్థాయి లో సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత ఏడాది 18.25లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా,ఈ ఏడాది రెట్టింపు చేయాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల సాగుతో పాటు దిగుబడి పెరిగిందన్నారు. రానున్న కాలంలో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల తెలంగాణ రాష్ట్రంలో వేసుకున్న పంటకు గ్యారంటి ఉందన్నారు. గత ప్రభుత్వాలు ధాన్యం సేకరణలో రైతులకు నమ్మకం కలిగించలేకపోయాయని, తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో ప్రతి పంటకు మద్దతు ధరను అందించి రైతులకు నమ్మకాన్ని కలిగించిందని వివరించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా అధికారులంతా సమిష్టిగా పని చేయాలని సూచించారు. 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడానికి 1,128 ఐకెపి సెంటర్లు, 1,799 ప్రాథమిక వ్యవస్థ సహకార సంఘాల కేంద్రాలు, ఇతర కేంద్రాలు 213 మొత్తంగా 3, 140 ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అవసరం మేరకు కేంద్రాల సంఖ్యను మరింత పెంచాలని కూడా నిర్ణయించినట్లు చెప్పారు. ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ఎట్టి పరిస్థితిలోనూ ఆలస్యం కావద్దన్నారు. కేంద్రాల వద్ద తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్, టెంట్ తదితర మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం సేకరణకు 8.59 కోట్ల గన్నీ బ్యాగులు అవసరముందన్నారు. ధాన్యం కొనుగోలు చేయకముందే బ్యాగులు కేంద్రాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాత బ్యాగులు, నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.
కేసులున్న మిల్లులకు బియ్యాన్ని సరఫరా చేయవద్దు
రైస్ మిల్లులపై కేసులుంటే ఆయా మిల్లులు ధాన్యం కొనుగోలు చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బియ్యం అక్రమాలకు పాల్పడుతున్న రైస్‌మిల్లర్స్‌పై 6ఎ కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ఇలాంటి కేసులున్న మిల్లులకు ధాన్యం సరఫరా చేయవద్దని ఆదేశించారు. మిల్లుల సామర్థాన్ని బట్టి ధాన్యం కేటాయించాలని, పంపిన ధాన్యాన్ని మిల్లర్లు వెంటనే దిగుమతి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర అవసరాలు పోగా 17 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని నిల్వ చేయాల్సి పౌరసరఫరాశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. ఇందులో 9.69 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికి సరిపడ గోదాములున్నాయని, మిగిలిన వాటి కోసం ఎఫ్‌సిఐ గోదాము నుంచి స్థలాన్ని తీసుకుంటున్నట్లు కమిషనర్ వివరించారు. ఈ ఏడాది స్టేట్ పూల్ రైస్ కోసం నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు, సన్న బియ్యం కోసం లక్షన్నర మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాల్సి ఉందన్నారు. గత ఏడాది వంద శాతం సిఎంఆర్ సేకరించినందుకు కమిషనర్, అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఈ ఏడాది కూడా అదే ఒరవడి కొనసాగించి పౌరసరఫరాలశాఖ ప్రతిష్టను పెంచాలన్నారు. వరి గ్రేడ్ ఎ రకానికి మద్దతు ధర రూ.1,770, కామన్ వెరైటికి రూ.1,750 అందిస్తామన్నారు. రైతులు ఎవరూ తక్కువ ధరకు అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేశారు.
దరఖాస్తు చేసిన వెంటనే రేషన్‌కార్డుల మంజూరు
దరఖాస్తు చేసిన వెంటనే వాటిని పరిశీలించి అర్హులైన వారికి రేషన్‌కార్డులను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఇందులో ఎలాంటి జాప్యంతో పాటు అలసత్యం ప్రదర్శించకుండా చూడాలన్నారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న కార్డులను వెంటనే లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. బియ్యాన్ని మిలిల్చే ఆలోచన ప్రభుత్వానికే మాత్రం లేదని కానీ దుర్వినియోగం కాకుండా చూడడమే తమ లక్షమన్నారు. బియ్యం తీసుకోకపోయినా కార్డును తతొలగించారని, బియ్యం అవసరం లేని వారు తీసుకోవద్దని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

Comments

comments

Related Stories: