కూటమికి సీటుపోటు

 వనపర్తిలో కాంగ్రెస్, టిడిపిల మధ్య తెగని పేచీ  కూటమి ప్రయోజనాల కోసం త్యాగానికి సిద్ధమవుతున్న తాజా మాజీ ఎంఎల్‌ఎ చిన్నారెడ్డి?  మరికొన్ని స్థానాల్లోనూ ఇదే పరిస్థితి  చంద్రబాబుకు వివరించిన టిటిడిపి నేతలు ఒకే స్థానాన్ని కోరుకుంటున్న రెండు పార్టీలు, గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న స్థానాల కోసం మిత్రపక్షాల మధ్య ముదిరిన పోటీ మన తెలంగాణ/హైదరాబాద్: మహాకూటమి పా ర్టీల మధ్య సూత్రరీత్యా పొత్తుకు నిర్ణయం జరిగినా సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. గెలుస్తామ ని […]

 వనపర్తిలో కాంగ్రెస్, టిడిపిల మధ్య తెగని పేచీ
 కూటమి ప్రయోజనాల కోసం త్యాగానికి సిద్ధమవుతున్న తాజా మాజీ ఎంఎల్‌ఎ చిన్నారెడ్డి?
 మరికొన్ని స్థానాల్లోనూ ఇదే పరిస్థితి
 చంద్రబాబుకు వివరించిన టిటిడిపి నేతలు

ఒకే స్థానాన్ని కోరుకుంటున్న రెండు పార్టీలు, గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న స్థానాల కోసం మిత్రపక్షాల మధ్య ముదిరిన పోటీ

మన తెలంగాణ/హైదరాబాద్: మహాకూటమి పా ర్టీల మధ్య సూత్రరీత్యా పొత్తుకు నిర్ణయం జరిగినా సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. గెలుస్తామ ని ధీమా ఉన్న సీట్లను వదులుకోరాదని అటు కాం గ్రెస్, ఇటు టిడిపి పార్టీలు పట్టుబడుతున్నాయి. సీ ట్ల సంఖ్య ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ గెలుపొందే స్థానాల విషయంలో మాత్రం ఏకాభిప్రా యం కుదిరింది. చాలా అసెంబ్లీ స్థానాల్లో రెండు పార్టీలూ పోటీ చేయాలని భావిస్తున్నాయి. జిహెచ్‌ఎంసి పరిధిలోని పలు సీట్లతోపాటు నర్సంపేట, వనపర్తి..ఇలాఅనేక సీట్లలో రెండు పార్టీలూ అభ్యర్థులను నిలబెట్టాలనుకుంటున్నాయి. గత ఎన్నికల్లో టిడిపి పార్టీ గెలుపొందిన స్థానాలన్నిం టా మళ్ళీ పోటీ చేయాలని భావిస్తుండ గా, అధికార పార్టీకి గట్టి పోటీ ఉండేచోట్ల కాంగ్రెస్ పోటీ చేయాలనుకుంటోంది. ఇలాంటి సీట్ల దగ్గర ఇంకా రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం రాలేదు.
కూటమి కోసం చిన్నారెడ్డి త్యాగం : టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి కోసం కాంగ్రెస్ తాజా మాజీ ఎంఎల్‌ఎ చిన్నారెడ్డి తన వ నపర్తి (సిట్టింగ్) సీటును త్యాగం చేస్తారా లేక పో టీ చేస్తారా అనేది రెండు పార్టీల్లో ఆసక్తికరంగా మారింది. రాజకీయాలు వేరైనా రావుల, చిన్నారెడ్డి మంచి మిత్రులు. గతంలో ఒకసారి చిన్నారెడ్డి మీ డియాతో ముచ్చటిస్తూ రావుల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తన వనపర్తి సీటును త్యాగం చేస్తానని ప్రకటించారు. అయితే రావుల మాత్రం తాను టిడిపిని వీడేది లేదని, సున్నితంగా తన మిత్రుడి వ్యాఖ్యాలను తిరస్కరించారు. ఇటీవల మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్, టిడిపిలు పొత్తు కుదుర్చుకుంటున్నందున రెండు పార్టీల మధ్య సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయి. మహాకూటమి పొత్తు లో భాగంగా టిడిపి 30 స్థానాల వరకు కావాలని పట్టుబడుతోంది. ఇందులో సిట్టింగ్ స్థానాలతో పాటు గతంలో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచినవి కూడా ఉన్నాయి. గత ఎన్నికల్లో వనపర్తి నుం చి కాంగ్రెస్ తరపున చిన్నారెడ్డి గెలుపొందారు. ఇదే స్థానంలో టిడిపి నుంచి పోటీ చేసిన రావుల మూడో స్థానానికి పరిమితమయ్యారు. పొత్తులో టిడిపి కోరిన విధంగా గెలుపొందిన వారికి, రెండో స్థానంలో నిలిచిన వారికి టికెట్లు ఇచ్చినట్లయితే వనపర్తి నుంచి చిన్నారెడ్డినే పోటీ చేయాల్సి ఉం టుంది. అయితే రావుల రానున్న ఎన్నికల్లో ఆ స్థా నం టిడిపికే వచ్చేలా చూడాలని కోరుతున్నట్లు తె లిసింది. కాంగ్రెస్ మాత్రం ఆయనను దేవరకద్ర నుంచి పోటీ చేసేలా చూడాలని కోరినట్లు సమాచారం. ఇదే విషయాన్నిశనివారం సచివాలయంకు వచ్చిన చిన్నారెడ్డితో మిత్రుడికి సీటు త్యాగం చేస్తారా అని ‘మన తెలంగాణ ప్రతినిధి’ ప్రస్తావించగా, కూటమిలో భాగంగా ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. కొన్ని స్థానాల్లో రెండు పార్టీల మధ్య సర్దుబాట్లు ఉంటాయని కాంగ్రెస్, టిడిపి వర్గాలు స్పష్టం చేశాయి. అలాగే నర్సంపేట సీటును టిడిపికే ఇవ్వాలని రేవూరి ప్రకాశ్ రెడ్డి పట్టుబడుతున్నారు. ఇక్కడి నుంచి గతంలో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో దొంతి మాధవరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి మళ్లీ ఆ పార్టీలోకే వెళ్లారు. పరకాల నుంచి రేవూరిని పోటీలోకి దిగేలా చూడాలని కాంగ్రెస్ కోరుతున్నట్లు తెలిసింది. అలాగే శేరిలింగంపల్లి నుంచి మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. ఇక్కడ కాంగ్రెస్ నుంచి గతంలో గెలిచిన భిక్షపతి యాదవ్ టికెట్‌ను ఆశిస్తున్నారు. అలాగే మహేశ్వరం నుంచి టికెట్ ఇవ్వాలని దేవేందర్ గౌడ్ కోరినప్పటికీ, కాంగ్రెస్ ఆ స్థానాన్ని సబితా ఇంద్రారెడ్డికి ఖరారు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఉప్పల్ నుంచి దేవేందర్ తనయుడు వీరేందర్‌గౌడ్‌కు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
టిడిపికి జహీరాబాద్; కంటోన్మెంట్ నుంచి గీతారెడ్డి?
సిట్టింగ్ స్థానాలను కూడా అవసరమైన చోట్ల ఒకరికొకరు మార్చుకునేలా మహాకూటమిలో ఉన్న కాంగ్రెస్, టిడిపి చర్చలు చేస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగా గత ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి టిడిపికి చెందిన సాయన్న గెలిచినప్పటికీ ఈసారి ఆ స్థానాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి గీతారెడ్డికి కేటాయించాలని ఆ ప్రాంత టిడిపి నేతలే కోరుతున్నారు. ఒకవేళ గీతారెడ్డి అందుకు ఒప్పుకుంటే ఆమె సిట్టింగ్‌గా ఉన్న జహీరాబాద్ నుంచి వై. నరోత్తమ్ పోటీ చేస్తారని టిడిపి వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఇంకా ఒకటి రెండు స్థానాల్లో ఇలాంటి సర్దుబాట్లు జరగనున్నట్లు సమాచారం.