సస్పెన్స్ కొనసాగుతోంది

‘నా పేరు సూర్య’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో అల్లు అర్జున్ తన నెక్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. తదుపరి చిత్రం చేయడానికి అతను ఎంతగానో ఆలోచించుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ‘మనం’ ఫేం విక్రమ్ కె.కుమార్ చెప్పిన స్టోరీ లైన్‌కు బన్నీ ఓకే చెప్పినప్పటికీ ఇంతవరకు స్క్రిప్ట్ ఫైనల్ కాలేదు. ఈ స్క్రిప్ట్‌పై చర్చలు సాగుతున్నాయి. విక్రమ్ తనదైనా శైలిలో సృజనాత్మకంగా స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దినా ఇంకా ఏదో మిస్ అయిందని అందులో మార్పుల కోసం […]

‘నా పేరు సూర్య’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో అల్లు అర్జున్ తన నెక్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. తదుపరి చిత్రం చేయడానికి అతను ఎంతగానో ఆలోచించుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ‘మనం’ ఫేం విక్రమ్ కె.కుమార్ చెప్పిన స్టోరీ లైన్‌కు బన్నీ ఓకే చెప్పినప్పటికీ ఇంతవరకు స్క్రిప్ట్ ఫైనల్ కాలేదు. ఈ స్క్రిప్ట్‌పై చర్చలు సాగుతున్నాయి. విక్రమ్ తనదైనా శైలిలో సృజనాత్మకంగా స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దినా ఇంకా ఏదో మిస్ అయిందని అందులో మార్పుల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ స్క్రిప్ట్ విషయంలో అల్లుఅర్జున్ పూర్తి సంతృప్తిగా లేడట. అందుకే ఇప్పటికీ విక్రమ్ ప్రాజెక్టును ఓకే చేయలేదు. తాజా సమాచారం ప్రకారం విక్రమ్‌తో సినిమా ఇప్పట్లో ఉండదని తెలిసింది. దీనిపై మరింత సమయం తీసుకొని ఆలోచిద్దామని బన్నీ విక్రమ్‌కు చెప్పాడట. దీంతో ఇప్పట్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ లేదని తెలిసింది. అయితే త్రివిక్రమ్ చెప్పిన స్టోరీలైన్‌పై బన్నీ ఎంతో ఆసక్తిగా ఉన్నాడట. ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ చిత్రీకరణ పూర్తికాగానే త్రివిక్రమ్ పూర్తి స్క్రిప్ట్‌ను అల్లు అర్జున్‌కు వినిపిస్తాడట. ఈ స్క్రిప్ట్ నచ్చితే వెంటనే సెట్స్‌పైకి వెళ్లాలన్న ఆలోచనతో బన్నీ ఉన్నాడని తెలిసింది. అయితే ‘అరవింద సమేత’ ఫలితంపైనే ఈ కాంబినేషన్ మూవీ ఆధారపడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతానికి ఈ సస్పెన్స్ ఇలాగే కొనసాగనుంది.

Comments

comments

Related Stories: