బంగారానికి తగ్గిన డిమాండ్

న్యూఢిల్లీ : అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో బంగారంకు డిమాండ్ పడిపోయింది. బులియన్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల బంగారం ధర రూ. 250 తగ్గి రూ. 31,450 పలికింది. బంగారం ధరలు పడిపోవడంతో ప్రపంచ మార్కెట్‌లలో బేరిష్ ట్రెండ్ చోటుచేసుకున్నట్లు ట్రేడర్లు చెప్పారు. అమెరికా,చైనా వాణిజ్య యుద్ధం పెరగడంతో డాలరు విలువ మరింత బలపడింది. బంగారం ధర తగ్గినప్పటికీ వెండి ధర మాత్రం పెరిగింది. వెండి ధర రూ. 70 […]

న్యూఢిల్లీ : అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో బంగారంకు డిమాండ్ పడిపోయింది. బులియన్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల బంగారం ధర రూ. 250 తగ్గి రూ. 31,450 పలికింది. బంగారం ధరలు పడిపోవడంతో ప్రపంచ మార్కెట్‌లలో బేరిష్ ట్రెండ్ చోటుచేసుకున్నట్లు ట్రేడర్లు చెప్పారు. అమెరికా,చైనా వాణిజ్య యుద్ధం పెరగడంతో డాలరు విలువ మరింత బలపడింది. బంగారం ధర తగ్గినప్పటికీ వెండి ధర మాత్రం పెరిగింది. వెండి ధర రూ. 70 పెరిగి కిలో వెండి రూ. 38,150 వద్ద ట్రేడయింది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛ బంగారం 10 గ్రాములు రూ. 31,450, 99.5 శాతం స్వచ్ఛ బంగారం రూ. 31,300గా ట్రేడయింది. అంతర్జాతీయ బంగారం ధర 0.68 శాతం తగ్గింది. అలాగే వెండి ధర 0.38 శాతం తగ్గింది. న్యూయార్క్‌లో శుక్రవారం ఔన్స్ బంగారం ధర 198.70 డాలర్లుగా, ఔన్స్ వెండి ధర 14.25 డాలర్లుగా ఉంది. సావరిన్ బంగారంలో ఎలాంటి మార్పులేకుండా ఎనిమిది గ్రాములు పీస్ రూ. 24,500గా ఉంది.