ఆన్‌లైన్ మార్కెట్‌కు జిఎస్‌టి చిక్కులు..

  వచ్చే నెల 1 నుంచి కొత్త నిబంధనలు  న్యూఢిల్లీ : దేశంలో పెద్ద నోట్ల రద్దు తరువాత విస్తరిల్లుతోన్న ఇంటర్నెట్ మార్కెటింగ్ ( ఇ మార్కెట్) వ్యవస్థకు జిఎస్‌టి చిక్కులు తలెత్తుతున్నాయి. ఈ ఆన్‌లైన్ మార్కెట్‌వేదికలకు కూడా నూతన జిఎస్‌టి నిబంధనలు వర్తింపచేసేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ కసరత్తులు చేస్తోంది. అత్యధిక స్థాయి లావాదేవీలకు తగ్గట్లుగా ఐటి పరిజ్ఞానం సంతరించుకోవడం, దీనిని ప్రజలకు అందుబాటులోకి తేవడం , విరివిగా ప్రచారం చేయడం ఒక ఎత్తు అయితే ఇ […]

 

వచ్చే నెల 1 నుంచి కొత్త నిబంధనలు 

న్యూఢిల్లీ : దేశంలో పెద్ద నోట్ల రద్దు తరువాత విస్తరిల్లుతోన్న ఇంటర్నెట్ మార్కెటింగ్ ( ఇ మార్కెట్) వ్యవస్థకు జిఎస్‌టి చిక్కులు తలెత్తుతున్నాయి. ఈ ఆన్‌లైన్ మార్కెట్‌వేదికలకు కూడా నూతన జిఎస్‌టి నిబంధనలు వర్తింపచేసేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ కసరత్తులు చేస్తోంది. అత్యధిక స్థాయి లావాదేవీలకు తగ్గట్లుగా ఐటి పరిజ్ఞానం సంతరించుకోవడం, దీనిని ప్రజలకు అందుబాటులోకి తేవడం , విరివిగా ప్రచారం చేయడం ఒక ఎత్తు అయితే ఇ కామర్స్, ఇమార్కెటింగ్ రంగాలకు కూడా జిఎస్‌టి పరిధిలో పన్నుల నిబంధనల వర్తింపునకు విధింపులకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ మేరకు కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. దీని మేరకు ఇ కామర్స్ కంపెనీలు తమ లావాదేవీకర్తల వనరుల నుంచి విలువల మేరకు ఒక్క శాతం పన్ను వసూలు చేసుకోవచ్చు. నూతన జిఎస్‌టి పరిధిలో చెల్లింపులు చేసే పక్షంలో ఈ పన్నును పొందవచ్చు. ఇటువంటి నిబంధనల వల్ల సదరు ఇ కామర్స్ కంపెనీల పనితీరు, సామర్థం పెరుగుతుంది. అంతేకాకుండా ఇ కామర్స్‌కు దిగిన సప్లయిర్ల టర్నోవర్‌ను వారి పన్నుల రిటర్న్‌లను సరైన విధంగా నిర్థారించుకునేందుకు , పన్నుల ఎగవేతల నివారణకు ఆదాయపు పన్ను శాఖకు వీలేర్పడుతుంది. పారదర్శకతను పాటించామని తెలియచేసుకుంటూ సప్లయర్స్ పన్నుల మినహాయింపులు పొందవచ్చు. నిబంధనలకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వశాఖ పలు దఫాలుగా ఇ కామర్స్ రంగం ప్రతినిధులతో చర్చించింది. అన్ని సాధకబాధకాలను తెలుసుకుంది. రెండు మూడు దఫాలు పన్నుల నిబంధనల అమలును వాయిదా వేస్తూ వచ్చినా, ఇప్పుడు వచ్చే నెల 1 నుంచి అమలుకు రంగం సిద్ధం చేసింది. అమేజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, పేటిఎం వంటి సంస్థలు ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో పేరొందాయి. కొత్త నిబంధనలపై ఆన్‌లైన్ దిగ్గజాలు స్పందించలేదు. ఆన్‌లైన్ మార్కెటింగ్ వ్యవస్థలో ఉండే వారు కొత్త నిబంధనలతో పలు చిక్కులు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది
బహుళ స్థాయి నమోదు ప్రక్రియ
ఇ కామర్స్ నిర్వాహకులు తమకు ఆర్డర్లు అందచేసే వారి నుంచి పన్నుల వసూళ్ల కర్తలుగా మారేందుకు ప్రతి రాష్ట్రంలో తమ ఏజెంట్లు ఉన్న చోట వేర్వేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవల్సి ఉంటుంది. టాక్స్ కలెక్టర్లుగా నమోదు కావల్సి ఉంటుంది. ఇది సంక్లిష్ట ప్రక్రియనే అవుతుందని వారు అధికారిక స్థాయి సమావేశాలలో తెలియచేసుకున్నట్లు వెల్లడైంది. టిసిఎస్ నిబంధనల మేరకు ఇ కామర్స్ నిర్వాహకులు రాష్ట్రాల వారిగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలంటే వారిపై భారం పెరగుతుందని వ్యాపార సలహా సంప్రదింపుల సంస్థ ఇ వై ఇండియా ప్రతినిధి బిపిన్ సాప్ర తెలిపారు. ప్రస్తుత చట్టంతో తమ వ్యాపారానికి ఏదేనీ రాష్ట్రంలో జిఎస్‌టి నమోదు కావాలంటే ఖచ్చితంగా అక్కడ కార్యాలయం ఉండటం కానీ తమ అధికారిక ప్రతినిధులు ఉండటం కానీ అవసరం అని తెలిపారు. ప్రతి రాష్ట్రంలో కార్యాలయాలు లేకుండా రిజిస్ట్రేషన్‌కు అనుమతిని ఇస్తే బాగుంటుందని పిడబ్లుసి ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా ఒక్క ఇ కామర్స్ పోర్టల్ ద్వారా అయినా సరుకులను అమ్మే వారు వార్షిక టర్నోవర్‌లతో సంబంధం లేకుండా జిఎస్‌టి పరిధిలో తమ పేరు నమోదు చేసుకోవల్సి ఉంటుంది.

Related Stories: