భారత మహిళలకు మరో గెలుపు

కొలంబో: శ్రీలంకతో జరిగిన మూడో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఐదు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. శశికళ సిరివర్ధనే 3ఫోర్లు, ఒక సిక్స్‌తో 35 పరుగులు చేసి టాస్ స్కోరర్‌గా నిలిచింది. కెప్టెన్ ఆటపట్టు (28), నీలాక్షి డిసిల్వా (30) తప్ప మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అరుంధతి 19 పరుగులు […]

కొలంబో: శ్రీలంకతో జరిగిన మూడో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఐదు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. శశికళ సిరివర్ధనే 3ఫోర్లు, ఒక సిక్స్‌తో 35 పరుగులు చేసి టాస్ స్కోరర్‌గా నిలిచింది. కెప్టెన్ ఆటపట్టు (28), నీలాక్షి డిసిల్వా (30) తప్ప మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అరుంధతి 19 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసింది. రాధాకు రెండు వికెట్లు లభించాయి. అనుజా పాటిల్ కూడా పొదుపుగా బౌలింగ్ చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 18.2 ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. స్టార్ క్రీడాకారిణి జమీమా రోడ్రిగ్స్ అద్భుత బ్యాటింగ్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న రోడ్రిగ్స్ ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 40 బంతుల్లోనే 57 పరుగులు చేసింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ప్రీత్ కౌర్ 24 పరుగులు సాధించింది. దీంతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపునతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 20 ఆధిక్యాన్ని అందుకుంది.

Related Stories: