బాసర ట్రిపుల్‌ఐటిలో విద్యార్థిని ఆత్మహత్య

బాసర : రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిదాయలయం ( ఆర్జీయూకేటి) బాసర ట్రిపుల్‌ఐటిలో కళాశాల వసతి భవనం పై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. కళాశాల అధ్యాపకులు తెలిపిన వివరాల ప్రకారం… సిద్దిపేట జిల్లా చిన్న కోడూరుకు చెందిన అనూష (17) పియూసి 02 వసంవత్సరం చదువుతుంది. అనూష కాలేజికి వేళ్ళకుండా గదిలో ఒంటరిగా ఉండి తొటి విద్యార్థినిలు కాలేజికి వెళ్దామని చెప్పిన రాలేదన్నారు. అంతాలోనే భవనం పైకి వెళ్లి దూకింది. […]


బాసర : రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిదాయలయం ( ఆర్జీయూకేటి) బాసర ట్రిపుల్‌ఐటిలో కళాశాల వసతి భవనం పై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. కళాశాల అధ్యాపకులు తెలిపిన వివరాల ప్రకారం… సిద్దిపేట జిల్లా చిన్న కోడూరుకు చెందిన అనూష (17) పియూసి 02 వసంవత్సరం చదువుతుంది. అనూష కాలేజికి వేళ్ళకుండా గదిలో ఒంటరిగా ఉండి తొటి విద్యార్థినిలు కాలేజికి వెళ్దామని చెప్పిన రాలేదన్నారు. అంతాలోనే భవనం పైకి వెళ్లి దూకింది. అది గమనించిన తోటి విద్యార్థులు సంబంధిత అధికారులకు సమాచారం అందజేయడంతో వెంటనే కళాశాల ఆస్పత్రిలో చికిత్సను నిర్వహించి విద్యార్థినికి మెరుగైన చికిత్స కోసం కళాశాల అంబులెన్స్‌లో నిజామాబాద్ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందు అనూష మరణించినట్టు వైద్యులు తెలిపారు. విద్యార్థి ఆత్మహత్మకు ముందు సూసైట్ నోట్‌లో ప్రేమ వ్యవహరం ఉన్నట్టు తెలిసింది. పోలీసులు ఆ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.  మృత దేహాన్ని భైంసా డిఎస్పి రాజేశ్ బల్లా, ట్రిపుల్‌ఐటి సిఐ అంజయ్యలు సందర్శించి కళాశాల ఛీప్ వార్డేన్ మధుసూధన్‌ రెడ్డి దగ్గర మృతి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకిని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మహేశ్ తెలిపారు.

Comments

comments