యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్ లో భారీ దోపిడీ

మహబూబ్‌నగర్: సరిగ్గా తెల్లవారుఝామున 4 గంటలకు అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయం. ఎక్కడ ఉన్నామో కూడా తెలియని పరిస్థితి. ఒక్కసారిగా దొంగలు రాళ్లతో దాడిచేసి ఎస్.2, ఎస్.3, ఎస్.8 బోగీలలో చొరబడిన దొంగలు కనిపించిన మహిళల మెడల్లో బలవంతంగా బంగారాన్ని దొంగిలించారు. అందర్ని బెదిరించి బంగారం, 4 సెల్‌ఫోన్లను తస్కరించిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి రైల్వే స్టేషన్ వద్ద యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 17603లో శనివారం చోటు చేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం… యశ్వంత్‌పూర్ […]


మహబూబ్‌నగర్: సరిగ్గా తెల్లవారుఝామున 4 గంటలకు అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయం. ఎక్కడ ఉన్నామో కూడా తెలియని పరిస్థితి. ఒక్కసారిగా దొంగలు రాళ్లతో దాడిచేసి ఎస్.2, ఎస్.3, ఎస్.8 బోగీలలో చొరబడిన దొంగలు కనిపించిన మహిళల మెడల్లో బలవంతంగా బంగారాన్ని దొంగిలించారు. అందర్ని బెదిరించి బంగారం, 4 సెల్‌ఫోన్లను తస్కరించిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి రైల్వే స్టేషన్ వద్ద యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 17603లో శనివారం చోటు చేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం… యశ్వంత్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ సరిగ్గా దివిటిపల్లి వద్దకు వస్తుందన్న సమాచారంతో ముందస్తుగా పక్కా పకడ్బందిగా దొంగలు రైల్వే సిగ్నల్ వ్యవస్థను కట్ చేయడంతో రెడ్‌సిగ్నల్ పడింది. దీంతో యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను డ్రైవర్ ఆపివేశాడు. దొంగలు రాళ్లతో దాడి చేసి బోగిల్లోకి ప్రవేశించారు. నిద్ర మత్తులో ఉన్న మహిళలను బెదిరించి మెడలోని ఉన్న బంగారు గొలుసులను, పుస్తెలతాడులను బలవంతంగా తీసుకొని ప్రయాణికులు అరవకుండా బెదిరించి భారీ దోపిడికి పాల్పడ్డారు. ఇంత జరుగుతున్న రైల్వే సెక్యూరిటీ గార్డ్ కానీ, పోలీసులు కానీ రాకపోవడం గమనార్హం. యశ్వంత్‌పూర్ లాంటి ఎక్స్‌ప్రెస్‌లో నిత్యం రైల్వే సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నప్పటికీ ఈ సంఘటనపై సకాలంలో స్పందించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దొంగలు రాడ్లు, కత్తులతో ధరించడంతో ప్రయాణికులు వణికి పోయారు. ఉదయం వరకు బయటి ప్రపంచానికి తెలియకపోవడంతో కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ దొంగతనానికి పాల్పడింది పార్థివ్ గ్యాంగ్‌గా అనుమానిస్తున్నారు. ఈ విషయంపై డిజిపికి రైల్వేశాఖ నివేధిక ఇచ్చినట్టు తెలిసింది. వెంటనే డిఎస్పి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బలగాలు రంగంలోకి దిగినట్టు సమాచారం. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని రైల్వే పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, కర్నూల్ రైల్వే లైన్లో వెళ్లే పలు రైళ్లలో ఇలాంటి దొంగతనాలు జరగడం సర్వ సాధారణంగా మారింది. గత కొంత కాలం క్రితమే ఈ ప్రాంతంలోనే రైల్వేలో దొంగతనాలకు పాల్పడినట్టు ఫిర్యాదులున్నాయి. ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి రైళ్లలో రైల్వే సెక్యూరిటీ ఫోర్స్‌ను పెంచాల్సిందిగా ప్రయాణికులు కోరుతున్నారు.
ఫోటో ః 22ఎంబిఎన్‌ఆర్36 యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఫైల్‌ఫోటో

Comments

comments