గోప్రో నుంచి కొత్త కెమెరాలు విడుదల…

ముంబయి: హీరో 7 సిరీస్‌లో గోప్రో పలు నూతన కెమెరాలను ఇండియన్ మార్కెట్‌లో తాజాగా రిలీజ్ చేసింది. గోప్రో హీరో7 వైట్, గోప్రో హీరో7 బ్లాక్, గోప్రో హీరో7 సిల్వర్ పేరిట ఈ కెమెరాలు సంస్థ విడుదల చేసింది. రూ.19వేల ధరకు హీరో7 వైట్ లభిస్తుండగా, రూ.28వేలకు హీరో7 సిల్వర్, రూ.37వేల ధరకు హీరో7 బ్లాక్ కెమెరా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. గోప్రో హీరో7 బ్లాక్ కెమెరాలో 12 మెగాపిక్సల్ కెమెరా సెన్సార్‌ ఉంది. వాటర్ ప్రూఫ్ […]

ముంబయి: హీరో 7 సిరీస్‌లో గోప్రో పలు నూతన కెమెరాలను ఇండియన్ మార్కెట్‌లో తాజాగా రిలీజ్ చేసింది. గోప్రో హీరో7 వైట్, గోప్రో హీరో7 బ్లాక్, గోప్రో హీరో7 సిల్వర్ పేరిట ఈ కెమెరాలు సంస్థ విడుదల చేసింది. రూ.19వేల ధరకు హీరో7 వైట్ లభిస్తుండగా, రూ.28వేలకు హీరో7 సిల్వర్, రూ.37వేల ధరకు హీరో7 బ్లాక్ కెమెరా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. గోప్రో హీరో7 బ్లాక్ కెమెరాలో 12 మెగాపిక్సల్ కెమెరా సెన్సార్‌ ఉంది. వాటర్ ప్రూఫ్ డిజైన్‌ను ఈ కెమెరాను ఏర్పాటు చేశారు. 2 ఇంచుల టచ్ స్క్రీన్, 128 జిబి వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, వాయిస్ కంట్రోల్, లైవ్ స్ట్రీమింగ్, సూపర్ ఫొటో మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, జిపిఎస్, 1220 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అద్భుత ఫీచర్లు ఇందులో లభిస్తున్నాయి.

 

Comments

comments

Related Stories: