బిజెపిని వీడిన మన్వేంద్ర సింగ్…

బర్మార్: బిజెపి సీనియర్ నేత జశ్వంత్ సింగ్ కుమారుడు, ఎంఎల్ఎ మన్వేంద్ర సింగ్ శనివారం ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. రాజస్థాన్ బర్మార్ లో నిర్వహించిన స్వాభిమాన్ ర్యాలీలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. బిజెపిలో చేరి తప్పుచేసినట్టు చెప్పారు. ఆత్మగౌరవం నినాదంతో మన్వేంద్ర సింగ్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు. ప్రజలు తీవ్ర అంసతృప్తిలో ఉన్నారని, వారి డిమాండ్లను నెరవేరకపోవడంతో వారు కోపంతో రగిలిపోతున్నారన్నారని వెల్లడించారు. గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో జశ్వంత్ సింగ్‌కు బిజెపి టికెట్‌ను […]

బర్మార్: బిజెపి సీనియర్ నేత జశ్వంత్ సింగ్ కుమారుడు, ఎంఎల్ఎ మన్వేంద్ర సింగ్ శనివారం ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. రాజస్థాన్ బర్మార్ లో నిర్వహించిన స్వాభిమాన్ ర్యాలీలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. బిజెపిలో చేరి తప్పుచేసినట్టు చెప్పారు. ఆత్మగౌరవం నినాదంతో మన్వేంద్ర సింగ్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు. ప్రజలు తీవ్ర అంసతృప్తిలో ఉన్నారని, వారి డిమాండ్లను నెరవేరకపోవడంతో వారు కోపంతో రగిలిపోతున్నారన్నారని వెల్లడించారు. గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో జశ్వంత్ సింగ్‌కు బిజెపి టికెట్‌ను నిరాకరించిన సంగతి తెలిసిందే. మన్వేంద్ర సింగ్  ఇప్పుడు ఏ పార్టీలో చేరేది అనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. ఆయన కాంగ్రెస్‌లో చేరడమా! లేదా స్వతంత్య్ర అభ్యర్థిగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా.? అన్నదానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది.

Related Stories: