లంకపై భారత మహిళా క్రికెట్ జట్టు విజయం…

కొలంబో: భారత మహిళల క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. శ్రీలంక మహిళల జట్టుతో శనివారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. సూపర్ ఫామ్‌లో ఉన్న యువ క్రికెటర్ జెమీమా రోడ్రిగెజ్ 57: 40 బంతుల్లో అర్ధశతకంతో రాణించడంతో భారత్ అలవోకగా గెలుపొందింది. 5 మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది. రెండో టి20 మ్యాచ్ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. 132 పరుగుల టార్గెట్‌ ను చేదించడానికి […]

కొలంబో: భారత మహిళల క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. శ్రీలంక మహిళల జట్టుతో శనివారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. సూపర్ ఫామ్‌లో ఉన్న యువ క్రికెటర్ జెమీమా రోడ్రిగెజ్ 57: 40 బంతుల్లో అర్ధశతకంతో రాణించడంతో భారత్ అలవోకగా గెలుపొందింది. 5 మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది. రెండో టి20 మ్యాచ్ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. 132 పరుగుల టార్గెట్‌ ను చేదించడానికి దిగిన టీంఇండియా ఆరంభంల మంచి శుభారంభం లభించింది. అయినప్పటికీ వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా ఆతిథ్య బౌలర్లను ధాటిగా ఎదుర్కొని పరుగులు రాబట్టింది. మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నాఎలాంటి తడబాటుకు లోనుకాకుండా స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసి 18.2 ఓవర్లలోనే భారత్‌ను విజయం వైపుకు చేర్చింది.

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన లంకను 131/ 8కే భారత మహిళ క్రికెట్ జట్టు కట్టడి చేసింది. లంక బ్యాట్స్‌ మెన్లలో శశికళ 35, నీలాక్షి డిసిల్వా 31, మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి, హర్మన్‌ప్రీత్ కౌర్ చెరో రెండు వికెట్లు తీసి ప్యాన్స్ ను ఆకట్టుకున్నారు.

Comments

comments