‘నిరుద్యోగులను రెచ్చగొడుతున్న కాంగ్రెస్’

హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుందని ఎంఎల్‌సి కర్నె ప్రభాకర్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ పాపం కాంగ్రెస్‌దేనని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను రెచ్చగొడుతుందని, కాంగ్రెస్ నేతల మాటలను తెలంగాణ నిరుద్యోగ యువత పట్టించుకోవడం లేదన్నారు. గతంలో నిరుద్యోగులను పట్టించుకోని కాంగ్రెస్ నేతలు… ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తామనడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. కోర్టుల్లో కేసులు వేసి ఉద్యోగాలు […]

హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుందని ఎంఎల్‌సి కర్నె ప్రభాకర్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ పాపం కాంగ్రెస్‌దేనని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను రెచ్చగొడుతుందని, కాంగ్రెస్ నేతల మాటలను తెలంగాణ నిరుద్యోగ యువత పట్టించుకోవడం లేదన్నారు. గతంలో నిరుద్యోగులను పట్టించుకోని కాంగ్రెస్ నేతలు… ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తామనడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు.

కోర్టుల్లో కేసులు వేసి ఉద్యోగాలు రాకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకునేందుకు కోర్టులో కేసుల వేసిన ఘనత కాంగ్రెస్‌దేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వైపు రైతాంగానికి నీళ్లు ఇస్తూనే… మరోవైపు నిరుద్యోగ యువతకు ఉద్యోగాల ప్రక్రియ కొనసాగిస్తున్నామని వెల్లడించారు. ఉద్యోగులను బానిసలుగా చూసిన చరిత్ర కాంగ్రెస్‌దన్నారు. స్థానికులకే ఉద్యోగాలు దక్కాలని జోనల్ వ్యవస్థను తీసుకొచ్చామని కర్నె వివరించారు.

మరిన్నీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….

Karne Prabhakar Comments on Congress Party

Telangana news

Comments

comments

Related Stories: