‘ఐకియా’కు జిహెచ్‌ఎంసి జరిమానా..!

హైదరాబాద్: స్వీడన్‌కు చెందిన రిటైల్ దిగ్గజం ఐకియా దేశంలోనే తన తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే,  అతిపెద్ద ఫర్నీచర్‌, ఫుడ్‌ వరల్డ్‌ ‘ఐకియా’పై జిహెచ్‌ఎంసి రూ. 5వేలు ఫైన్ వేసింది. అసలేం జరిగిందంటే… నగరానికి చెందిన ఓ వ్యక్తి ఐకియా ఫుడ్‌ వరల్డ్‌లో తన కూతురు కోసం చాకోలెట్‌ కేక్‌ను తీసుకున్నాడు. అనంతరం కేకును తీసి పరిశీలించగా అందులో పురుగు ఉండడం గమనించాడు. దీతో అతడు జిహెచ్‌ఎంసి కమిషనర్‌కు ఐకియా యాజమాన్యంపై ఆధారాలతో సహా ట్విట్టర్‌ […]

హైదరాబాద్: స్వీడన్‌కు చెందిన రిటైల్ దిగ్గజం ఐకియా దేశంలోనే తన తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే,  అతిపెద్ద ఫర్నీచర్‌, ఫుడ్‌ వరల్డ్‌ ‘ఐకియా’పై జిహెచ్‌ఎంసి రూ. 5వేలు ఫైన్ వేసింది. అసలేం జరిగిందంటే… నగరానికి చెందిన ఓ వ్యక్తి ఐకియా ఫుడ్‌ వరల్డ్‌లో తన కూతురు కోసం చాకోలెట్‌ కేక్‌ను తీసుకున్నాడు. అనంతరం కేకును తీసి పరిశీలించగా అందులో పురుగు ఉండడం గమనించాడు. దీతో అతడు జిహెచ్‌ఎంసి కమిషనర్‌కు ఐకియా యాజమాన్యంపై ఆధారాలతో సహా ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. అందుకు స్పందించిన జిహెచ్‌ఎంసి అధికారులు ఐకియా యాజమాన్యానికి రూ. 5 వేలు జరిమానా విధించింది. కాగా, ఐకియాకు ఫైన్ పడడం ఇది రెండోసారి. ఇంతకుముందు కూడా బిర్యానీలో పురుగుల వచ్చిన ఘటనలో రూ. 11, 500 ఫైన్ పడింది. ఇలా వరుస జరిమానాలతో ఐకియా వార్తల్లో నిలుస్తోంది.

Comments

comments