ధావన్ ఖాతాలో మరో రికార్డు

దుబాయ్:  బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే మ్యాచ్ లో నాలుగు క్యాచ్ లు అందుకోవడంతో ఇండియా తరుపున ఏడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లో నజ్ముల్లా హుస్సేన్, షకిబుల్, మెహదీ హసన్, ముస్తాఫిజర్ రెహ్మాన్ క్యాచ్ లను పట్టుకున్నాడు. ఈ జాబితాలో భారత ఆటగాళ్లలో సునీల్ గవాస్కర్, అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, మొహమ్మద్ కైఫ్, వివిఎస్ లక్ష్మణ్ లు […]

దుబాయ్:  బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే మ్యాచ్ లో నాలుగు క్యాచ్ లు అందుకోవడంతో ఇండియా తరుపున ఏడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లో నజ్ముల్లా హుస్సేన్, షకిబుల్, మెహదీ హసన్, ముస్తాఫిజర్ రెహ్మాన్ క్యాచ్ లను పట్టుకున్నాడు. ఈ జాబితాలో భారత ఆటగాళ్లలో సునీల్ గవాస్కర్, అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, మొహమ్మద్ కైఫ్, వివిఎస్ లక్ష్మణ్ లు ఉన్నారు. ఒక వన్డే మ్యాచ్ లో అత్యధిక క్యాచ్ లు పట్టిన ఆటగాడిగా జాంటీ రోడ్స్ ఉన్నాడు. 1993లో  వెస్టిండీస్  తో జరిగిన మ్యాచ్ లో జాంటీ రోడ్స్ ఐదు క్యాచ్ లు అందుకున్నాడు.

Asia Cup 2018: Shikhar Dhawan creates unique record

Telangana news

 

Comments

comments