పడవ బోల్తా ఘటన :136కు చేరిన మృతుల సంఖ్య

నైరోబీ : టాంజానియాలోని విక్టోరియా సరస్సులో పడవ బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 136కు చేరింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గురువారం ఉకారా దీవి సమీపంలోని ఎంవి న్వేరెరెలో పడవ బోల్తా పడిన విషయం విదితమే. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 300మందికి పైగా ఉన్నారు. పడవలో భారీగా సరుకులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా తీరం వద్ద ఉన్న గట్టుకు చేరుకునేందుకు అందరూ ఒకేసారి పరుగులు పెట్టడంతో పడవ […]

నైరోబీ : టాంజానియాలోని విక్టోరియా సరస్సులో పడవ బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 136కు చేరింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గురువారం ఉకారా దీవి సమీపంలోని ఎంవి న్వేరెరెలో పడవ బోల్తా పడిన విషయం విదితమే. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 300మందికి పైగా ఉన్నారు. పడవలో భారీగా సరుకులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా తీరం వద్ద ఉన్న గట్టుకు చేరుకునేందుకు అందరూ ఒకేసారి పరుగులు పెట్టడంతో పడవ పక్కకు ఒరిగిపోయి ఈ ప్రమాదం జరిగింది. 40 మందిని అధికారులు రక్షించారు. పడవ ప్రమాదానికి కారణమైన వారిని అరెస్టు చేయాలని టాంజానియా అధ్య క్షుడు మగుపులి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై పొరుగు దేశాలు సంతాపం తెలిపాయి.

Boat Rollover : 136 People died

Comments

comments