కెసిఆర్‌కు గుడి కట్టించిన కానిస్టేబుల్!

నల్గొండ: తమ అభిమాన నాయకులపై అభిమానం చూపించడానికి అభిమానులు భిన్న మార్గాలను ఎంచుకుంటుంటారు. అలాగే నల్గొండ జిల్లా నిడమనూర్ కు చెందిన గొగుల శ్రీను, జ్యోతి దంపతులు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ కు గుడి కట్టించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వృత్తిరీత్య కానిస్టేబుల్ అయిన శ్రీను కెసిఆర్ పాలనకు ముగ్ధుడై ఏకంగా రూ. 4 లక్షలు వెచ్చించి ఆయనకు గుడి కట్టించి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని, ఆలయ ప్రారంభోత్సవానికి కెసిఆర్ కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తామని శ్రీనివాస్ దంపతులు తెలిపారు. […]

నల్గొండ: తమ అభిమాన నాయకులపై అభిమానం చూపించడానికి అభిమానులు భిన్న మార్గాలను ఎంచుకుంటుంటారు. అలాగే నల్గొండ జిల్లా నిడమనూర్ కు చెందిన గొగుల శ్రీను, జ్యోతి దంపతులు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ కు గుడి కట్టించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వృత్తిరీత్య కానిస్టేబుల్ అయిన శ్రీను కెసిఆర్ పాలనకు ముగ్ధుడై ఏకంగా రూ. 4 లక్షలు వెచ్చించి ఆయనకు గుడి కట్టించి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని, ఆలయ ప్రారంభోత్సవానికి కెసిఆర్ కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తామని శ్రీనివాస్ దంపతులు తెలిపారు. కెసిఆర్ పాలన ఆయనకు చాలా నచ్చిందట. ఆయనపై తన అభిమానాన్ని మాటల్లో చెప్పలేక ఏకంగా గుడికట్టేశాడు. గత అరవై ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగున్నరేళ్ల టిఆర్ఎస్ పాలనలో జరిగిందని శ్రీనివాస్ పేర్కొన్నాడు. కెసిఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్లుతుందన్నాడు. కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని శ్రీను తెలిపాడు.

Comments

comments

Related Stories: