తెలంగాణలో 3రోజుల పాటు వర్షాలు

హైదరాబాద్ : తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు పలు చోట్ల ఈ వర్షాలు పడుతాయని వారు వెల్లడించారు. వాయుగుండం క్రమంగా బలపడుతుందని వారు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్, కుమ్రంభీం, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా […]

హైదరాబాద్ : తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు పలు చోట్ల ఈ వర్షాలు పడుతాయని వారు వెల్లడించారు. వాయుగుండం క్రమంగా బలపడుతుందని వారు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్, కుమ్రంభీం, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Rains in Telangana

Comments

comments

Related Stories: