కులాంతర వివాహితుల రక్షణ చట్టం చేయాలి

మిర్యాలగూడ: అమృత తల్లిదండ్రులు అమృతను అంత బలంగా ప్రేమించివుంటే ఆమె భర్తను ఇంత కిరాతకంగా హత్య చేసి వుండేవారు కాదని తమిళనాడు రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త, దళిత్ శోషణ్ ముక్త్ మంచ్ జాతీయ నాయకురాలు కౌసల్య అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ కుటుంబాన్ని కౌసల్య పరామర్శించారు.  అనంతరం ప్రణయ్ ఇంటివద్ద కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కాడిగల్ల భాస్కర్  అధ్యక్షతన జరిగిన దళితుల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా […]

మిర్యాలగూడ: అమృత తల్లిదండ్రులు అమృతను అంత బలంగా ప్రేమించివుంటే ఆమె భర్తను ఇంత కిరాతకంగా హత్య చేసి వుండేవారు కాదని తమిళనాడు రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త, దళిత్ శోషణ్ ముక్త్ మంచ్ జాతీయ నాయకురాలు కౌసల్య అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ కుటుంబాన్ని కౌసల్య పరామర్శించారు.  అనంతరం ప్రణయ్ ఇంటివద్ద కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కాడిగల్ల భాస్కర్  అధ్యక్షతన జరిగిన దళితుల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌసల్య  మాట్లాడుతూ కులం అనే అడ్డుగోడలను కూల్చేందుకు అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేయాలన్నారు. తన భర్త శంకర్ కుల దురహంకారంతో 2016లో జరిగిన దాడిలో చనిపోయారన్నారు. అమృత విషయంలో ప్రేమతో కాకుండా కులం, ఆర్ధిక విషయాలను దృష్టిలో వుంచుకొని హత్యకు నెలల మందుగానే పథకం రచించారని అన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి సుపారి హంతకులను రప్పించి ప్రణయ్‌ను చంపించి అమృత కష్టాల పాలు చేయడ మంటే కూతురు భవిష్యత్ పట్ల తండ్రికి కించిత్ ఆలోచన లేద న్నారు. కులదురహంకార హత్యలను, దాడులను అరికట్టేందుకు కులాంతర వివాహితుల రక్షణ చట్టం తీసుకరావాలన్నారు. అమృత బాధను అర్ధం చేసుకొని అండగా వుండేందుకు అనేక మంది ముందుకొస్తున్నారని నేను కూడ సహయ సహకారాలు అందిస్తానని అన్నారు. తన భర్త చనిపోయిన తరువాత తాను కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నాని అమృత కూడా పోరాడాలని అన్నారు. ప్రణయ్ హత్యకేసులో దోషులకు శిక్ష పడేవరకు బెయిల్ మంజూరు చేయరాదని కోరారు. కేసును సిబిఐకి అప్పగించాలని, కేసు విచారణకు ప్రత్యేక ప్రాసిక్యూషన్ టీమ్ ఏర్పాటు చేయాలని, అమృత కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌నాయక్, అడ్వకేట్ ఖదీర్, డేవిడ్‌రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వస్కుల మట్టయ్య, తాళ్ళపల్లి రవి, కొండేటి శ్రీను, రెముడాల పరుశురామలు, పాలడుగు ప్రభావతి పాల్గొన్నారు.

Related Stories: