భారత్ –పాక్ చర్చలు రద్దు

 కశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య దృష్టా కేంద్రం నిర్ణయం  పాక్ ప్రధాని ఇమ్రాన్ నిజస్వరూపం బైటపడింది : విదేశాంగ ప్రతినిధి వ్యాఖ్య న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భారత్  పాక్ విదేశాంగ మం త్రుల భేటీకి తొలుత అంగీకరించిన కేద్రం తాజాగా జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు ముగ్గురు పోలీసు అధికారులను కిడ్నాప్ చేసి దారుణంగా కాల్చి చంపిన ఘటన నేపథ్యంలో ఆ సమావేశాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. భారత్‌పాక్ విదేశాంగమంత్రుల భేటీ రద్దు  నిర్ణయాన్ని […]

 కశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య దృష్టా కేంద్రం నిర్ణయం
 పాక్ ప్రధాని ఇమ్రాన్ నిజస్వరూపం బైటపడింది : విదేశాంగ ప్రతినిధి వ్యాఖ్య

న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భారత్  పాక్ విదేశాంగ మం త్రుల భేటీకి తొలుత అంగీకరించిన కేద్రం తాజాగా జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు ముగ్గురు పోలీసు అధికారులను కిడ్నాప్ చేసి దారుణంగా కాల్చి చంపిన ఘటన నేపథ్యంలో ఆ సమావేశాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. భారత్‌పాక్ విదేశాంగమంత్రుల భేటీ రద్దు  నిర్ణయాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌కుమార్ శుక్రవారం ప్రకటిస్తూ, జమ్మూ కశ్మీర్‌లో ముగ్గురు పోలీసుల దారుణ హత్య, కశ్మీరీ ఉగ్రవాది బుర్హన్ వనీని స్వాతంత్ర యోధుడిగా కీర్తిస్తూ పాక్ ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేయడం ఈ భేటీ రద్దుకు కారణాలుగా పేర్కొన్నారు. ఈ రెండు సంఘటనలతో పాక్ కొత్త ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ నిజ స్వరూ పం,  చర్చల ప్రతిపాదన వెనుక ఉన్నపాక్ ప్రభుత్వ  దుష్ట ఆలోచన ప్రపంచానికి బట్టబయలు అయిందని ఆయన అన్నారు. ఈనెలాఖరున ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీలు సమావేశమవుతారని రవీశ్‌కుమార్ గురువారం ప్రకటించిన విష యం తెలిసిందే. అయితే ఈ ప్రకటన వెలువడిన 24 గంటలు కూడా గడవక ముందే జమ్మూ కశ్మీర్‌లో ముగ్గురు స్పెషల్ పోలీసు అధికారులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చారు. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతూ ఉండడంతో ప్రభుత్వం ఈ భేటీపై పునరాలోచించి రద్దుకు నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.‘ తాజాగా పాక్‌లోని ఉగ్రవాదసంస్థల చేతి లో మన భద్రతా జవాన్ల దారుణ హత్య, ఒక ఉగ్రవాదిని దేశభక్తుడిగా కీర్తిస్తూ ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేయడం పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోదనే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి’ అని రవీశ్ కుమార్  అన్నారు.‘ రెండు దేశాల మధ్య పరస్పరం శాంతిని కాంక్షిస్తూ.. ప్రజలకోసం ముఖ్యంగా భావి తరాల భవిష్యత్తు కోసం  ఉభయతారకంగా చర్చలు జరుపుదాం. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు భేటీ అయ్యేలా చూడండి’ అని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఈ నెల 14న ప్రధాని మోడీకి రాసిన లేఖలోఅభ్యర్థించడం తెలిసిందే. దీనికి సాను కూలంగా స్పందించిన ప్రభుత్వం న్యూయార్క్‌లో  ఇరు దేశాల విదేశాంగ మంత్రుల భేటీకి అంగీకరించింది. అయితే శుక్రవారం తెల్లవారుజామున  హి జ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్‌లో ముగ్గురు పోలీసు అధికారులను కిడ్నాప్ చేపి దారుణంగా కాల్చి చంపారు. పాక్‌తో భేటీకి సిద్ధమవుతున్న వేళ ఉగ్రవాదులు చర్యలతో కేంద్రం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. తాజా సంఘటన దృష్టా న్యూయార్క్‌లో ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలలో ఇరు దేశాల విదేశాంగమంత్రులు మర్యాదపూర్వకంగా కరచాలనం చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొనడం కోసం విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ఈ నెల 24న న్యూయార్క్‌కు బయలుదేరి వెళ్తారు.

Related Stories: