ఇటు జోరు.. అటు పోరు

 ముమ్మర ప్రచారానికి సకల సన్నాహాలు చేసుకుంటున్న టిఆర్‌ఎస్  సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ప్రణాళిక దగ్గరే చతికిలబడిన మహాకూటమి  50 రోజులు,100 సభల వ్యూహంతో కారు జోరు  సిట్టింగ్ స్థానాలపై పట్టుబడుతున్న టిడిపి  మిత్రులందరికీ 25 కంటె ఇవ్వలేనంటున్న కాంగ్రెస్ మన తెలంగాణ/హైదరాబాద్: వినాయక నిమజ్జనం తర్వాత ‘50రోజులు -100 బహిరంగసభలు’ విధానంతో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంచే యాలని టిఆర్‌ఎస్ కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేసుకుంటూ ఉంటే విపక్ష పార్టీల ‘మహాకూటమి’ మాత్రం ఇంకా ఆలోచన దశలోనే ఉంది. […]

 ముమ్మర ప్రచారానికి సకల సన్నాహాలు చేసుకుంటున్న టిఆర్‌ఎస్
 సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ప్రణాళిక దగ్గరే చతికిలబడిన మహాకూటమి
 50 రోజులు,100 సభల వ్యూహంతో కారు జోరు
 సిట్టింగ్ స్థానాలపై పట్టుబడుతున్న టిడిపి
 మిత్రులందరికీ 25 కంటె ఇవ్వలేనంటున్న కాంగ్రెస్

మన తెలంగాణ/హైదరాబాద్: వినాయక నిమజ్జనం తర్వాత ‘50రోజులు -100 బహిరంగసభలు’ విధానంతో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంచే యాలని టిఆర్‌ఎస్ కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేసుకుంటూ ఉంటే విపక్ష పార్టీల ‘మహాకూటమి’ మాత్రం ఇంకా ఆలోచన దశలోనే ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడే ఈ కూటమిలోని భాగస్వా మ్య పార్టీలకు ఎన్ని సీట్లను సర్దుబాటు చేయాలనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. టిడిపి, సిపిఐ, తెలంగాణ జనసమితి పార్టీలు ఎన్ని సీట్లు కావాలనుకుంటున్నాయో ఇప్పటికే కాంగ్రెస్‌కు స్పష్టంచేశాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఇంకా ఒక స్పష్టమై న నిర్ణయానికి రాలేకపోయింది. కూటమికి తప్పనిసరిగా ‘కనీస ఉమ్మడి ప్రణాళిక’ ఉండాలని వస్తు న్న డిమాండ్‌పై ఎలాంటి నిర్ణయం జరగలేదు. ప్రతీ పార్టీ దానికంటూ ప్రత్యేకమైన డిమాండ్‌ను కాంగ్రెస్ ముందు పెడుతోంది. ఇదే సమయంలో కమిటీల కూర్పుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండడం, కోమటిరెడ్డి, విహెచ్ లాంటివారు పార్టీ రాష్ట్ర నాయకత్వంపై ఫైర్ కావడం.. పలు సమస్యలతో కాంగ్రెస్ ఇబ్బంది పడుతోంది.
సిట్టింగ్ స్థానాలపై తెలుగుదేశం పట్టు : కనీసం గా ఇరవై సీట్లయినా లేకపోతే కష్టమేనని టిడిపి పట్టుబడుతూ ఉంది. సిట్టింగ్ స్థానాలతో పాటు గత ఎన్నికల్లో రెండవ స్థానంలో ఉన్న నియోజకవర్గాలన్నింటినీ ఇవ్వాలని పట్టుబడుతోంది. గెలుపు ఖాయమనుకునే స్థానాల్లో వెనక్కి తగ్గవద్దంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల హై దరాబాద్ పర్యటన సందర్భంగా రాష్ట్ర నాయకత్వానికి స్పష్టత ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తెలుగుదేశం గెలిచిన స్థానాలను ప్రధానంగా ఆ పార్టీ పట్టుబడుతోంది. సీనియర్ నేతలను ఈ నియోజకవర్గాల నుంచి నిలబెట్టాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. సూర్యాపేట స్థానం టిడిపికి ఇవ్వాలంటూ పట్టుబడుతూ ఉంది. రాష్ట్ర నాయక త్వం ఇటీవల కాంగ్రెస్ నేతలతో జరిపిన సంప్రదింపుల్లో ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చె ప్తోంది. అయితే తాజా పరిణామాలను బేరీజు వే సుకున్న చంద్రబాబు మాత్రం సీట్ల సంఖ్య కంటే కచ్చితంగా గెలుపొందే స్థానాలు, సీట్ల సర్దుబాటు లో భాగంగా వచ్చిన సీట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించుకునే విధంగా కృషి చేయాలని స్పష్టం చేశారు. అభ్యర్థులకు ఆర్థిక అవసరాలను తీర్చడానికి సైతం పార్టీ సిద్ధంగా ఉందంటూ సంకేతాలిచ్చినట్లు సమాచారం. కూకట్‌పల్లి, జూబ్లిహిల్స్, రాజేంద్రనగర్,మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కుత్బుల్లాపూర్, ఎల్‌బి నగర్… ఇలా నగరంలోని సీట్లపై ప్రధానంగా ఆ పార్టీ దృష్టి పెట్టింది. ఏ స్థానంలో ఎవరిని నిలబెట్టాలనేదానిపై కూడా రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చింది. మరోవైపు సిపిఐ సైతం బెల్లంపల్లి, దేవరకొండ, మునుగోడు, హుస్నాబాద్, వైరా, కొత్తగూడెం తదితర ఐదారు స్థానాలను డిమాండ్ చేస్తోంది. తెలంగాణ జన సమితి కూడా గౌరవప్రదమైన తీరులో సీట్లను కోరుతోంది. స్వంతంగా పోటీచేసే స్థయిర్యం లేకపోవడం, గట్టిగా డిమాండ్ చేసి స్థానాలను తెచ్చుకోలేకపోవడం ఆ పార్టీకి సవాలుగా మారింది. అభ్యర్థులు, గెలిచి తీరుతామన్న ధీమా లేకపోవడంతో నిర్దిష్టంగా ఫలానా నియోజకవర్గం కావాలని కాంగ్రెస్‌ను పట్టుబట్టి మరీ సాధించుకునేంత తెగువ ఆ పార్టీకి కొరవడింది. మిత్రపక్షాల నుంచి స్పష్టమైన డిమాండ్ ఉన్నప్పటికీ మూడు పార్టీలకూ కలిపి పాతిక కంటే ఎక్కువ ఇవ్వలేమని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. కనీసంగా 90 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. మిత్రపక్షాలకు సీట్ల సంఖ్య తేలడం ఒక అంశమైతే ఏయే స్థానాలను ఇవ్వాలనేది మరో ప్రధాన అంశంగా ముందుకొస్తోంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, గ్రూపుల తగాదాలు, కోర్టుల్లో కేసులు, కమిటీల కూర్పుతో తలెత్తిన అసంతృప్తి… వీటన్నింటి నడుమ కొట్టుమిట్టాడుతున్న పార్టీ సీట్ల సర్దుబాటు చర్యలను ప్రారంభించడంలో జరుగుతున్న జాప్యంపై మిత్రపక్షాల్లో రోజురోజుకూ అసహనం పెరుగుతోంది. స్వంతంగా పోటీ చేసే పరిస్థితి లేకపోవడం, పొత్తులు ఇంకా ఖరారు కాకపోవడం ఆ పార్టీల నేతల్ని నీరసపరుస్తోంది.

Comments

comments

Related Stories: