అమ్ముకుంటున్నారు

 గాంధీభవన్‌లో పదవులు, టికెట్లకు దుకాణం తెరిచారు  70ఏళ్లు దాటిన వారూ పోటీ చేస్తారట  పార్టీకి సేవ చేసిన వారికి మొండిచేయి, ఉత్తమ్ మాటలు వినాల్సిన పని కుంటియాకు లేదు  కాంగ్రెస్‌ను వీడను : రాజగోపాల్‌రెడ్డి ఫైర్ మనతెలంగాణ/హైదరాబాద్: గాంధీభవన్‌లో పదవులు, సీట్లను అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ ఎం ఎల్‌సి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. శుక్రవా రం రాత్రి  ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 70 ఏళ్లు దాటి న వారు ప్రస్తుత ఎన్నికల్లో […]

 గాంధీభవన్‌లో పదవులు, టికెట్లకు దుకాణం తెరిచారు
 70ఏళ్లు దాటిన వారూ పోటీ చేస్తారట
 పార్టీకి సేవ చేసిన వారికి మొండిచేయి, ఉత్తమ్ మాటలు వినాల్సిన పని కుంటియాకు లేదు
 కాంగ్రెస్‌ను వీడను : రాజగోపాల్‌రెడ్డి ఫైర్

మనతెలంగాణ/హైదరాబాద్: గాంధీభవన్‌లో పదవులు, సీట్లను అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ ఎం ఎల్‌సి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. శుక్రవా రం రాత్రి  ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 70 ఏళ్లు దాటి న వారు ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయాలని ఉబలాటపడుతున్నారని, యువత అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉందని, ఇలాంటి సమయంలో వయస్సు పైబడిన వారు టికెట్లను ఆశించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రకటించిన కమిటీల్లో  చాలామంది సీనియర్లకు అవమానం జరిగిందని, కొత్తగా వచ్చిన వారిని కమిటీల్లో తీసుకున్నారని ఆయన ఆగ్ర హం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన కమిటీల్లో 25% మందే అర్హులున్నారన్నారు. 2014 సంవత్సరంలోనూ కొందరు మ్యాచ్‌ఫిక్సింగ్ పాల్పడి, గెలవని అభ్యర్థులను నియోజకవర్గాల్లో పోటీలో నిలబెట్టి వేరే పార్టీల అభ్యర్థులు గెలిచేలా వ్యవహారించార ని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో కూడా అదే పంథాను కొనసాగించాలన్నఆలోచనలో ఉన్నారని, ఇలాంటి విషయా లు బయటకు రావాలన్న ఉద్ధేశ్యంతో తాను బహిరంగంగా మాట్లాడుతున్నానన్నారు. ఇది నా ఒక్కడి స మస్య కాదనీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలకు సంబంధించి సమస్యగా ఆ యన పేర్కొన్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌ను కొన్ని స్వార్థ పర రాజకీయ శక్తులు తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు.
ఇంత పెద్ద కమిటీని చూసి నవ్వుకుంటున్నారు
ప్రదేశ్ ఎన్నికల కమిటీని 41 మందితో నియమించారని అసలు దానికి 9 మంది ఉంటే సరిపోతుందన్నారు. ఇంత పెద్ద కమిటీని చూసి మిగతా పార్టీల వారు నవ్వుకుంటున్నారని ఆయన వాపోయారు. నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఎంపిక చేయడానికి 9 మంది సరిపోతారని ఆయన పేర్కొన్నారు. మ్యానిఫెస్టో కమిటీ విధి విధానాలు ఏమిటో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. కొన్ని స్వార్థపర రాజకీయ శక్తులను చూసి కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారన్నారు. సీట్లను పదవులను అమ్ముకునే వారు తనకు షోకాజులు ఇవ్వడం ఏమిటనీ ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వారు ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలవకుండా కుట్రలు పన్నుతున్నారన్నారు. ఈ విషయమై ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశామని అంతలోనే తనకు షోకాజు నోటీసులు అందాయన్నారు. షోకాజు నోటీసులకు భయపడనని, త్వరలో దానికి సమాధానమిస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గొడవ చేసిన వ్యక్తుల్లో తాను ఒకడినని, అలాంటి నన్ను ఎదగకుండా కొందరు అడ్డుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ తప్పు చేశానో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉత్తమ్ వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు
టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మొదటి నుంచి తనకు వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. కనీసం తనను నమ్ముకున్న కార్యకర్తలకు మండల కాంగ్రెస్ కమిటీలో కూడా పదవులు ఇవ్వలేదన్నారు. తనను కావాలనే ఉత్తమ్‌కుమార్ రెడ్డి అణగదొక్కుతున్నాడని ఆయన ఆరోపించారు. అయినా ఇన్ని రోజులుగా భరిస్తున్నానని, అది కార్యకర్తల కోసమేనని ఆయన పేర్కొన్నారు. గతంలో 5 సంవత్సరాల పాటు ఎంపీగా పనిచేశానని, ప్రస్తుతం ఎమ్మెల్సీగా రెండు సంవత్సరాల కాలం ఎమ్మెల్సీగా పదవీకాలం పూర్తయిందన్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల అభీష్టం మేరకు మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నానని ఇదే విషయాన్ని తాను అధిష్టానానికి తెలియచేశానన్నారు.ఈ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణ యం తీసుకున్నా దానికి తాను శిరసావహిస్తానన్నారు.
కాంగ్రెస్‌ను అధికారంలోకి
తీసుకురావడమే ముఖ్యం
తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తనకు ముఖ్యమన్నారు. దానికోసం కాంగ్రెస్ పార్టీకి నమ్మినబంటుగా వ్యవహారిస్తానన్నారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి తాను మాట్లాడడం లేదన్నారు. తన లాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ కోల్పోతే పార్టీతో పాటు కార్యకర్తలకు నష్టం జరుగుతుందన్నారు. పార్టీకి నష్టం జరుగుతున్నప్పుడు కనువిప్పు కలిగేలా తాను వ్యవహారిస్తున్నానని, తాను చెప్పే మాటలకు సీనియర్లు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. కుంతీయా కాంగ్రెస్ అధిష్టానానికి దూతగా ఇక్కడకు వచ్చారని ఆయన కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. కాం గ్రెస్ పార్టీలో అందరూ సిఎం అభ్యర్థులేనని అలాంటి వారిని ఏకతాటిపైకి తీసుకురావాల్సిన బాధ్యత కుం తీయా పైనే ఉందన్నారు. టిఆర్‌ఎస్‌లో కెసిఆర్ మాటే వేదవాక్కని ఆయనకు ఎవరూ ఎదురు చెప్పరని అలానే కుంతీయా కూడా వ్యవహారించాలని సూచించానన్నారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట విని కుంతీయా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అందరికీ సమన్యాయం చేయకపోతే కుంతీయా అవసరం లేదన్నారు.
అవన్నీ వదంతులే…
2014 ఎన్నికలకు ముందు తాను కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్‌ఆర్‌సిపిలో చేరతానని, 2014 ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌లో చేరతానని, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో బిజెపి పార్టీలో చేరతానని వదంతులు సృష్టిస్తున్నారని అవన్నీ అబద్ధాలేనని ఆయన పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడనన్నారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని 4 సార్లు కలిశానని ఆయన పార్టీలోకి రావడం ఇష్టంలేదని కొందరు ప్రచారం చేస్తున్నారని అవన్నీ తప్పుడు వార్తలేనన్నారు. ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క మునుగోడు నియోజకవర్గానికి వచ్చి ప్రచారం చేస్తే అక్కడ అభ్యర్థి గెలవడని, తాను ప్రచారం చేస్తేనే మునుగోడు అభ్యర్థి గెలుస్తాడని ఆయన తెలిపారు.
మహాకూటమితో పొత్తు వలన పార్టీకి నష్టం కలుగుతుందా లేదా అన్న విషయాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అవసరం ఉన్న చోట పొత్తు అవసరమన్నారు. ఒక తల్లీకి పుట్టిన పిల్లలు ఒకే పార్టీలో ఉండాలన్న రూల్ లేదన్నారు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారికి ఉంటుందన్నారు.

Comments

comments