ఇన్ఫోసిస్‌లో 1000 మంది అమెరికన్ టెక్కీల నియామకం

న్యూఢిల్లీ : సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ స్థానిక ప్రతిభకు ప్రాధాన్యతనిస్తూ అమెరికాలో దాదాపు 1000 మంది నియామకాలు చేపట్టింది. 2023 సంవత్సరం నాటికి ఐటి నైపుణ్యం అంతరాన్ని పూడ్చేందుకు 10 వేల మంది అమెరికన్లకు ఉపాధి కల్పించాలని కంపెనీ లక్షంగా చేసుకుంది. దీనిలో భాగంగానే అరిజోన స్టేట్‌లో 1000 మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇచ్చింది. అరిజోన స్టేట్‌లో టెక్నాలజీ కమ్ ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించనున్నామని, దీనిలో భాగంగానే 1000 మంది నియామకం చేపట్టామని అధికారి ఒకరు […]

న్యూఢిల్లీ : సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ స్థానిక ప్రతిభకు ప్రాధాన్యతనిస్తూ అమెరికాలో దాదాపు 1000 మంది నియామకాలు చేపట్టింది. 2023 సంవత్సరం నాటికి ఐటి నైపుణ్యం అంతరాన్ని పూడ్చేందుకు 10 వేల మంది అమెరికన్లకు ఉపాధి కల్పించాలని కంపెనీ లక్షంగా చేసుకుంది. దీనిలో భాగంగానే అరిజోన స్టేట్‌లో 1000 మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇచ్చింది. అరిజోన స్టేట్‌లో టెక్నాలజీ కమ్ ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించనున్నామని, దీనిలో భాగంగానే 1000 మంది నియామకం చేపట్టామని అధికారి ఒకరు తెలిపారు. 2017 మే నెలలో చేప్పినట్టుగా ఇన్ఫోసిస్ 10 వేల మంది అమెరికన్ల నియామకం, అమెరికా వ్యాప్తంగా ఇన్నోవేషన్ హబ్‌ల ఏర్పాటు చేయనున్నామని అన్నారు. తమ లక్షంలో భాగంగా ఇప్పటివరకు 5,874 మంది అమెరికన్లను ఉద్యోగాల్లో నియమించుకున్నామని తెలిపారు.

Comments

comments

Related Stories: