దివాన్ హౌసింగ్ 50 శాతం పతనం

న్యూఢిల్లీ : మార్కెట్లో దివాన్ హౌసింగ్ 50 శాతం పతనమైంది. రుణాలపై వడ్డీ చెల్లింపులకు సంబంధించి డిహెచ్‌ఎఫ్‌ఎల్ డిఫాల్టయిందన్న వార్తలు షేరును ఒక్కసారిగా కుప్పకూలేలా చేశాయి. ఈ వార్తలు వాస్తవం కాదని, తమ వద్ద పదివేల కోట్ల రూపాయల మేర నిధులున్నాయని కంపెనీ మేనేజ్‌మెంట్ వివరణ ఇచ్చినా కౌంటర్లో అమ్మకాలకు అడ్డుకట్టపడలేదు. ట్రేడింగ్ చివరకు కొంత కోలుకొని షేరు ధర 42 శాతం పైన నష్టపోయి రూ. 350 వద్ద ముగిసింది. ఒక్క రోజులో కంపెనీ మార్కెట్ […]

న్యూఢిల్లీ : మార్కెట్లో దివాన్ హౌసింగ్ 50 శాతం పతనమైంది. రుణాలపై వడ్డీ చెల్లింపులకు సంబంధించి డిహెచ్‌ఎఫ్‌ఎల్ డిఫాల్టయిందన్న వార్తలు షేరును ఒక్కసారిగా కుప్పకూలేలా చేశాయి. ఈ వార్తలు వాస్తవం కాదని, తమ వద్ద పదివేల కోట్ల రూపాయల మేర నిధులున్నాయని కంపెనీ మేనేజ్‌మెంట్ వివరణ ఇచ్చినా కౌంటర్లో అమ్మకాలకు అడ్డుకట్టపడలేదు. ట్రేడింగ్ చివరకు కొంత కోలుకొని షేరు ధర 42 శాతం పైన నష్టపోయి రూ. 350 వద్ద ముగిసింది. ఒక్క రోజులో కంపెనీ మార్కెట్ క్యాప్‌లో రూ.10వేల కోట్లు ఆవిరయ్యాయి. డిహెచ్‌ఎల్‌ఎఫ్ దెబ్బకు ఇతర హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా భారీ నష్టాలను చవిచూశాయి. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 23 శాతం, గృహ్ ఫైనాన్స్ 15 శాతం, ఎల్‌ఐసి హౌసింగ్ 15 శాతం, ఎల్ అండ్ టి హౌసింగ్ ఫైనాన్స్ 15 శాతం మేర నష్టాలు చవిచూశాయి. రెరా, జిఎస్‌టితో ఇప్పటికే రియల్టీ రంగం కుదేలవుతూ ఉంది. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ అంశం బయటకు రావడం ఈ రంగంపై మరింత నెగిటివ్ ప్రభావం చూపింది.  ఐఎల్ అం డ్ ఎఫ్‌ఎస్ తరహా పరిస్థితిని ఎదుర్కొంటాయన్న భయాలు ఎన్‌బిఎఫ్‌సి(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ)ను దెబ్బతీశాయి. ఇచ్చిన రుణాలు వసూలు చేసుకోవడంలో డిహెచ్‌ఎఫ్‌ఎల్ ఇతర హౌసింగ్ కంపెనీలు ఇబ్బందులు పడతాయన్న భయాలే పతనానికి కారణమయ్యాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Comments

comments

Related Stories: