దలాల్ స్ట్రీట్‌కు ‘ఎన్‌బిఎఫ్‌సి’ బాంబ్

 ఒక్కసారిగా కుప్పకూలిన మార్కెట్లు   ఓ దశలో 1500 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్   కోలుకుని 279 పాయింట్లతో సరి   42 శాతం పడిపోయిన డిహెచ్‌ఎఫ్‌ఎల్ న్యూఢిల్లీ : దేశీయ స్టాక్‌మార్కెట్లు చుక్కలు చూపించాయి. ఎన్‌బిఎఫ్‌సి(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ) షేర్ల పతనంతో శుక్రవారం దలాల్ స్ట్రీట్ అతలాకుతలమైంది. తొలుత లాభాల్లో కనిపించినా, మధ్యాహ్నం తర్వాత సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈసారి పతనం అంతా ఇంతా కాదు.. సెన్సెక్స్ ఒక్కసారిగా 1500 పాయింట్లు పడిపోవడంతో ఇన్వెస్టర్లు బెంబెలెత్తిపోయారు. కొనుగోళ్ల కారణంగా […]

 ఒక్కసారిగా కుప్పకూలిన మార్కెట్లు 

 ఓ దశలో 1500 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 

 కోలుకుని 279 పాయింట్లతో సరి 

 42 శాతం పడిపోయిన డిహెచ్‌ఎఫ్‌ఎల్

న్యూఢిల్లీ : దేశీయ స్టాక్‌మార్కెట్లు చుక్కలు చూపించాయి. ఎన్‌బిఎఫ్‌సి(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ) షేర్ల పతనంతో శుక్రవారం దలాల్ స్ట్రీట్ అతలాకుతలమైంది. తొలుత లాభాల్లో కనిపించినా, మధ్యాహ్నం తర్వాత సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈసారి పతనం అంతా ఇంతా కాదు.. సెన్సెక్స్ ఒక్కసారిగా 1500 పాయింట్లు పడిపోవడంతో ఇన్వెస్టర్లు బెంబెలెత్తిపోయారు. కొనుగోళ్ల కారణంగా సూచీలు భారీ నష్టాల నుంచి రికవరీ అయ్యాయి. మొత్తానికి వరుసగా నాలుగో రోజు మార్కెట్లు డీలాపడ్డాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 279 పాయింట్ల క్షీణతతో 36,842 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 91 పాయింట్ల నష్టంతో 11,143 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో గరిష్ట స్థాయి నుంచి చూస్తే ఒకానొక సమయంలో ఏకంగా 1496 పాయింట్లమేర క్షీణించింది. ఫైనాన్షియల్ రంగ కౌంటర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దివాన్ హౌసింగ్ ఏకంగా 50 శాతం, యస్ బ్యాంక్ 29 శాతానికిపైగా పతనమైంది. అలాగే ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 8 శాతానికిపైగా, బజాజ్ ఫైనాన్స్ 4 శాతానికిపైగా క్షీణించాయి. యుపిఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్స్ 3 శాతానికిపైగా డౌన్ అయింది. రంగాల వారీగా సూచీలు అన్ని కూడా నష్టాల్లోనే ముగిశాయి. గరిష్టంగా నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 2.59 శాతం, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ సూచీ 3.45 శాతం, నిఫ్టీ రియల్టీ సూచీ 3.51 శాతం మేరకు డౌన్ అయ్యాయి. ప్రధానంగా భారతీ ఇన్‌ఫ్రాటెల్, బిపిసిఎల్ స్టాక్స్ 3 శాతానికిపైగా పెరగ్గా, ఐఒసి, హిందాల్కో, హెచ్‌పిసిఎల్ షేర్లు 2 శాతానికిపైగా లాభపడ్డాయి.మార్కెట్ పతనం బాటలోనే చిన్న షేర్లు అమ్మకాలతో కుదేలయ్యాయి. మిడ్ క్యాప్ సూచీ 2 శాతం నీరసించగా, స్మాల్ క్యాప్ 3 శాతం డౌన్ అయింది. ట్రేడైన మొత్తం షేర్లలో 2103 నష్టపోగా, కేవలం 592 లాభపడ్డాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) బుధవారం మరోసారి రూ.2,184 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ విక్రయించారు. మరోవైపు దేశీ ఫండ్స్(డిఐఐలు) బుధవారం రూ. 1201 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి.
యస్ బ్యాంక్ 30 శాతం డౌన్
ప్రైవేటురంగ యస్ బ్యాంక్ షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి. బ్యాంకు సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్ రాణా కపూర్ పదవీకాలం పొడగింపును ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) అంగీకరించకపోవడంతో ఆ ప్రభావం షేర్లపై పడింది. శుక్రవారం భారీ నష్టాలతో మొదలైన బ్యాంకు షేరు విలువ 34 శాతం తగ్గి 52 వారాల కనిష్ఠానికి పడిపోయింది. ఆఖరికి 30 శాతం నష్టంతో రూ.225 వద్ద ముగిసింది. రాణా కపూర్‌ను బ్యాంకు సిఇఒగా మరో మూడేళ్ల పాటు కొనసాగించాలని ఆగస్టులో యస్ బ్యాంక్ బోర్డు నిర్ణయించింది.

Comments

comments