అదరగొట్టిన బౌలర్లు…

దుబాయి: ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సూపర్4 మ్యాచ్‌లో భారత్ గెలుపు బాటలో పయానిస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 173 పరుగులకే కుప్పకూలింది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా తాజా సమాచారం లభించే సమయానికి 33 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 78 (బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. స్వల్ప లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు శుభారంభం అందించారు. […]

దుబాయి: ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సూపర్4 మ్యాచ్‌లో భారత్ గెలుపు బాటలో పయానిస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 173 పరుగులకే కుప్పకూలింది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా తాజా సమాచారం లభించే సమయానికి 33 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 78 (బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. స్వల్ప లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు శుభారంభం అందించారు. ఇద్దరు బంగ్లా బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ధావన్ 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 40 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించాడు.
చెలరేగిన జడేజా,
టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్‌కు ప్రారంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. బంగ్లా స్కోరు 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు భువనేశ్వర్ లిటన్ దాస్ (7)ను పెవిలియన్ పంపించాడు. తర్వాతి ఓవర్‌లోనే మరో ఓపెనర్ నజ్మల్ హుస్సేన్ (7)ను బుమ్రా వెనక్కి పంపాడు. దీంతో బంగ్లా 16 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఈ దశలో సాకిబ్ కాస్త వేగంగా ఆడి బంగ్లాలో ఆశలు రేకెత్తించాడు. అయితే 12 బంతుల్లో 3ఫోర్లతో 17 పరుగులు చేసిన అతన్ని రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన మహ్మద్ మిథున్ (9) కూడా నిరాశ పరిచాడు. అతన్ని కూడా జడేజా పెవిలియన్ బాట పట్టించాడు. ఇక కుదురుగా ఆడుతున్న సీనియర్ ఆటగాడు ముష్ఫికుర్ రహీర్ (21)ను జడేజా ఔట్ చేసి భారత్‌ను తిరుగులేని స్థితికి చేర్చాడు. మరోవైపు స్టార్ ఆటగాడు మహ్మదుల్లా కొద్ది సేపు పోరాటం కొనసాగించాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. అతనికి ముసాదిక్ హుస్సేన్ అండగా నిలిచాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన మహ్మదుల్లా 51 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేసి భువనేశ్వర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికి పోయాడు. మరోవైపు ముసాదిక్ (12)ను జడేజా ఔట్ చేశాడు. దీంతో బంగ్లాదేశ్ 101 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ఈ దశలో మెహదీ హసన్, మహ్మద్ మోర్తజా భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. వేగంగా ఆడుతూ స్కోరును పరిగెత్తించారు. బంతికో చొప్పున పరుగు తీస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఇదే క్రమంలో 8వ వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ధాటిగా ఆడిన మెహదీ హసన్ 50 బంతుల్లో రెండు ఫోర్లు, మరో 2 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన మొర్తజా రెండు సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. దీంతో బంగ్లాదేశ్ స్కోరు 173 పరుగులకు చేరింది. భారత బౌలర్లలో జడేజా పది ఓవర్లలో 29 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్, బుమ్రాలకు మూడేసి వికెట్లు లభించాయి.

Related Stories: