శ్రీకాంత్, సింధు పరాజయం

చైనా  ఓపెన్ ముగిసిన  భారత్ పోరాటం న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళలు, పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు ఓటమి ఎదురైంది. ఇప్పటికే పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్ పరాజయం చవిచూసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో పి.వి.సింధు, పురుషుల విభాగంలో కిదాంబి శ్రీకాంత్ ఓటమి పాలయ్యారు. కిందటి సీజన్‌లో వరుస టైటిల్స్‌తో చెలరేగి పోయిన శ్రీకాంత్ ఈ ఏడాది మాత్రం పేలవమైన ఆటతో […]

చైనా  ఓపెన్ ముగిసిన  భారత్ పోరాటం

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళలు, పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు ఓటమి ఎదురైంది. ఇప్పటికే పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్ పరాజయం చవిచూసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో పి.వి.సింధు, పురుషుల విభాగంలో కిదాంబి శ్రీకాంత్ ఓటమి పాలయ్యారు. కిందటి సీజన్‌లో వరుస టైటిల్స్‌తో చెలరేగి పోయిన శ్రీకాంత్ ఈ ఏడాది మాత్రం పేలవమైన ఆటతో నిరాశే మిగిల్చాడు. ఆసియా క్రీడల్లో పతకం సాధించడంలో విఫలమైన శ్రీకాంత్ చైనా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. జపాన్ ఆటగాడు కెంటో మమోటాతో జరిగిన పోరులో శ్రీకాంత్ ఓటమి చవిచూశాడు. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో మమోటా 219, 2111 తేడాతో శ్రీకాంత్‌ను చిత్తు చేసి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో సింధు పోరాడి ఓడింది. చైనా క్రీడాకారిణి చెన్ యూఫితో జరిగిన మ్యాచ్‌లో సింధు 2111, 1121, 1521  తేడాతో ఓటమి పాలైంది. తొలి సెట్‌ను సింధు అలవోకగా గెలుచుకుంది. అయితే తర్వాతి రెండు సెట్లలో సింధుకు చుక్కెదురైంది. ప్రత్యర్థి క్రీడాకారిణి అద్భుత షాట్లతో సింధును హడలెత్తించింది. చూడచక్కని షాట్లతో అలరించిన యూఫి అలవోకగా రెండు సెట్లు గెలిచి సెమీస్‌కు చేరుకుంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చైనా ఓపెన్‌ను గెలవని సింధు ఈసారి భారీ ఆశలతో బరిలోకి దిగింది. కానీ, సెమీస్‌కు చేరకుండానే నిష్క్రమించి అభిమానులను నిరాశకు గురి చేసింది.

Comments

comments

Related Stories: