థైరాయిడ్‌పై అవగాహన అవసరం

30 ఏళ్లు దాటిన ప్రతి మహిళా థైరాయిడ్ హెచ్చుతగ్గుల గురించి తెలుసుకోవాలి. ఈ హార్మోన్ ఎక్కువైనా, తక్కువైనా సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి లక్షణాలను బట్టి థైరాయిడ్ సమస్యను ప్రారంభంలోనే గుర్తించాలి. అటువంటి లక్షణాలేంటో తెలుసుకుందాం… * 8 నుంచి 10 గంటలు నిద్రపోయినా అలసటగా ఉండడం. * ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం * తక్కువ సమయంలోనే బరువు పెరగడం * భావోద్వేగాల్లో తీవ్రమైన మార్పులు, కోపం, డిప్రెషన్ లక్షణాలు * నెలసరి క్రమం తప్పడం * […]

30 ఏళ్లు దాటిన ప్రతి మహిళా థైరాయిడ్ హెచ్చుతగ్గుల గురించి తెలుసుకోవాలి. ఈ హార్మోన్ ఎక్కువైనా, తక్కువైనా సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి లక్షణాలను బట్టి థైరాయిడ్ సమస్యను ప్రారంభంలోనే గుర్తించాలి. అటువంటి లక్షణాలేంటో తెలుసుకుందాం…

* 8 నుంచి 10 గంటలు నిద్రపోయినా అలసటగా ఉండడం.
* ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం
* తక్కువ సమయంలోనే బరువు పెరగడం
* భావోద్వేగాల్లో తీవ్రమైన మార్పులు, కోపం, డిప్రెషన్ లక్షణాలు
* నెలసరి క్రమం తప్పడం
* గర్భం దాల్చలేకపోవడం
* కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, టెండనైటిస్
* చల్లని చేతులు, పాదాలు. చలి వేయడం
* చర్మం పొడిబారి పగలడం, గోళ్లు విరిగిపోతూ ఉండడం, వెంట్రుకలు రాలడం
* మలబద్ధకం
* మెదడు మొద్దుబారడం, ఏకాగ్రతాలోపం, జ్ఞాపక శక్తి తగ్గడం
* మెడ వాపు, గురక, గొంతు బొంగురుపోవడం

Related Stories: