వైద్యం వికటించి చిన్నారి మృతి..

ఘట్‌కేసర్ : వైద్యం వికటించి చిన్నారి మృతి చెందిన సంఘటన ఘట్‌కేసర్ గ్రామంలో చోటు చేసుకుంది. చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం… ఎదులబాద్ గ్రామానికి చెందిన గుండ్ల లింగం కూతురు ఐశ్వర్య(9)కు ఉదయం వాంతులు, విరోచానాలు కావడంతో, ఘట్‌కేసర్ అమృత సాయి ఆసుపత్రికి తీసుకోచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్లూ కోజులు, ఇంజక్షన్లు ఇస్తుూ ,చికిత్సఅందించారు. రాత్రి 8 గంటలకు గ్లూకోజ్ అయిపోవడంతో ఒక సారి శ్వాస వదిలిందని తల్లీదండ్రులు తెలిపారు. డాక్టర్ […]

ఘట్‌కేసర్ : వైద్యం వికటించి చిన్నారి మృతి చెందిన సంఘటన ఘట్‌కేసర్ గ్రామంలో చోటు చేసుకుంది. చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం… ఎదులబాద్ గ్రామానికి చెందిన గుండ్ల లింగం కూతురు ఐశ్వర్య(9)కు ఉదయం వాంతులు, విరోచానాలు కావడంతో, ఘట్‌కేసర్ అమృత సాయి ఆసుపత్రికి తీసుకోచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్లూ కోజులు, ఇంజక్షన్లు ఇస్తుూ ,చికిత్సఅందించారు. రాత్రి 8 గంటలకు గ్లూకోజ్ అయిపోవడంతో ఒక సారి శ్వాస వదిలిందని తల్లీదండ్రులు తెలిపారు. డాక్టర్ గ్లూకోజ్ తీసి ఉప్పల్ డిపో వద్ద స్పార్క్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని పంపించారు. అక్కడికి వెళ్లాగానే వైద్యులు చిన్నారిని పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. చిన్నారి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నారిని తీసుకొచ్చి అమృత ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. చిన్నారి మృతికి కారణమైన వైద్యులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు కల్పించుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Comments

comments

Related Stories: