దుబాయ్ వెళ్తూ..కానరాని లోకాలకు ..

కొందుర్గు: బతుకు దెరువు కోసం దుబాయి వెళ్దామని ఎన్నో ఆశలతో ఇంటి నుండి బయలు దేరిన ఓ గిరిజన కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.కుటుంబంతో ఆనందంగా గడపలనే ఉద్దేశ్యంతో దుబాయి బయలు దేరిన యువకుడు మార్గమాద్యంలోనే మృత్యు ఒడిలోకి చేరుకున్నాడు. వికారాబాద్ జిల్లా బొమరాస్‌పేట మండలం మదన్‌పల్లి తండాకు చెందిన వీరు కారులో శుక్రవారం ఉదయం  కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ విమానాశ్రయనికి బయలుదేరారు.   ఈ కుటుంబం పెద్ద దిక్కు అయిన యువకుడు బయలు దేరిన కొన్ని గంటలల్లో […]

కొందుర్గు: బతుకు దెరువు కోసం దుబాయి వెళ్దామని ఎన్నో ఆశలతో ఇంటి నుండి బయలు దేరిన ఓ గిరిజన కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.కుటుంబంతో ఆనందంగా గడపలనే ఉద్దేశ్యంతో దుబాయి బయలు దేరిన యువకుడు మార్గమాద్యంలోనే మృత్యు ఒడిలోకి చేరుకున్నాడు. వికారాబాద్ జిల్లా బొమరాస్‌పేట మండలం మదన్‌పల్లి తండాకు చెందిన వీరు కారులో శుక్రవారం ఉదయం  కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ విమానాశ్రయనికి బయలుదేరారు.   ఈ కుటుంబం పెద్ద దిక్కు అయిన యువకుడు బయలు దేరిన కొన్ని గంటలల్లో మృత్యు ఒడిలోకి చేరడంతో ఆ కుటుంబంలో విషాదచాయాలు అలుముకున్న సంఘటన కొందుర్గు మండల పరిధిలోని రామంచంద్రపూర్ హన్‌మాన్ దేవాలయం వద్ద ఉదయం దాదాపు 10.౩౦ గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. కొందుర్గు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన కథనం ప్రకారం …… వికారాబాద్ జిల్లా బొమరాస్‌పేట మండలం మదన్‌పల్లి తండాకు చెందిన అంగోతు నార్యనాయక్ కుమారుడైన అంగోతు బాబు నాయక్ (24) గతంలో దుబాయిలో పనిచేసేవాడని ,ఆరు నెలల క్రితం ఇంటికి వచ్చాడని ఆయన తెలిపారు. మళ్లీ దుబాయి వెళ్లడం కోసం బాబు నాయక్ తో పాటు వారి బందువులైన అంగోతు లాలు ,అంగోతు బుజిబాయి, అంగోతు హుమ్లిబాయి ,అంగోతు గణేష్ ,అంగోతు మోతిలాల్ , నేనవత్ ,రాజు అనే వీరందరు ఎపి 20 యం 5522 నెంబరు గల కారులో వికారాబాద్ నుండి షాద్‌నగర్ వైపు వెళ్తుండగా కొందుర్గు మండల పరిధిలోని రామంచంద్రపూర్ రాగనే కారు స్టీరింగ్ పని చేయక పోవడంతో పక్కనే ఉన్న మిషన్ భగీరథ పైపుల పైకి కారు దూసుకెళ్లడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొనడంతో వెనక సీట్‌లో కుర్చున్న బాబు నాయక్ త్రీవ గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడని, మరో 6 మంది గాయాలు అయ్యాయని వారిని షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి 108 ఆంబులెన్స్ లో తరళించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి బాబాయి అంగోతు లాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Comments

comments

Related Stories: